సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఎన్నికల సంఘం ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. మొత్తం 35 కేంద్రాల్లో లెక్కింపు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభించి తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తామని, అనంతరం 8:20 గంటలకు ఈవీఎంల లెక్కింపు మొదలవుతుందని వివరించారు. 


కాగా,  తొలుత పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపట్టి, ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు.  ఆ తర్వాత ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపును ప్రారంభిస్తారు. తెలంగాణలోని మొత్తం 35 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనుండగా...కౌంటింగ్ కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలో ఓట్ల లెక్కింపునకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ ప్రకటించారు. 


మీడియాతో మాట్లాడిన ఆయన  మొత్తం లెక్కింపు ప్రక్రియకు సంబంధించి చట్ట నిబంధనలు, కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు జారీ చేసిన మార్గదర్శకాలపై కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే పూర్తి స్పష్టత ఇచ్చామని ఆయన వివరించారు.ఇక, దేశం మొత్తం దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్‌ బరిలో మొత్తం 185 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ లెక్కింపు ఆలస్యం కాకుండా ఉండేందుకు 36 టేబుళ్ల ఏర్పాటుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినట్టు రజత్ కుమార్ తెలిపారు. మిగిలిన నియోజకవర్గాల్లో మాత్రం 14 టేబుళ్ల ద్వారా లెక్కింపు చేపట్టనున్నట్టు పేర్కొన్నారు.


వీవీప్యాట్ స్లిప్పులు లెక్కించిన తర్వాతే తుది ఫలితాన్ని వెల్లడించనున్నట్టు తెలిపారు. పోటీలో ఉన్న అభ్యర్థులు కానీ, వారి ఏజంట్లు కానీ రీకౌంటింగ్ కోరితే .. వారి విన్నపాలను మన్నించే, తిరస్కరించే అధికారం కేవలం రిటర్నింగ్ అధికారులకే ఉంటుంది. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా జోక్యం చేసుకోలేదు. ఒకవేళ ఆ విజ్ఞప్తులను సదరు అధికారి తిరస్కరించే పక్షంలో ఆ విషయాన్ని లిఖిత పూర్వకంగా తెలియచేయాల్సి ఉంటుందని రజత్ కుమార్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: