వైకాపా అధ్యక్షుడు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పులివెందులలో ఘన విజయం సాధించారు. 2014తో పోలిస్తే, ఈసారి 91వేల ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు.


 ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు బీజేడీ అధ్యక్షుడు నవీన్ పట్నాయక్ కు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

—  విశాఖ దక్షిణం టీడీపీ వాసుపల్లి గణేష్ కుమార్ గెలుపు...అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

— తూ.గో.పిఠాపురం వైకాపా అభ్యర్థి పెండెం దొరబాబు విజయం మెజార్టీ 16వేలు


  శ్రీకాకుళం: పాలకొండ వైకాపా అభ్యర్థి విశ్వాసరాయి కళావతి విజయం. 18,432 ఓట్లు మెజార్టీతో గెలుపొందిన విశ్వాసరాయి కళావతి.

— గుంటూరు: పెదకూరపాడులో 14,042 ఓట్ల  అధిక్యంతో వైకాపా అభ్యర్థి నంబూరు శంకరరావు విజయం

— మదనపల్లె వైకాపా అభ్యర్థి నవాజ్ భాషా 29164 ఓట్ల ఆధిక్యంతో విజయం.

— తూ.గో.రాజానగరం లో వైకాపా అభ్యర్థి జక్కంపూడి రాజా 31, 495 గెలుపు


కరీంనగర్ పార్లమెంట్: 11 లక్షల 47 వేల 687 పోలైన ఓట్లు. కాంగ్రెస్: 1,79,140, బీజేపీ: 497462, టీఆర్ఎస్: 408560
బీజేపీ అభ్యర్థి బండి సంజయ్    90902 వేల ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ పై విజయం

 చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి 35 వేల 121 ఓట్లతో విజయం

అమరావతి : సచివాలయంలో భద్రత కట్టుదిట్టం చేయాలని పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశం. సీఎం కార్యాలయం సహా సచివాలయం నుంచి ఎలాంటి ఫైల్స్ బయటకు తరలించకుండా చూడాలని సెక్యురిటి సిబ్బందికి ఆదేశాలు. ఇప్పటికే ఎకనామిక్ డేవేలప్మెంట్ బోర్డ్ సహా పలు శాఖల్లో కీలక ఫైల్స్ ధ్వంసం చేస్తున్నారని ఇంటెలిజెన్స్  హెచ్చరిక

 కుప్పంలో14వ రౌండ్‌ ముగిసే సరికి చంద్రబాబు 22,957 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, పులివెందులలో 17వ రౌండ్‌ ముగిసే సరికి జగన్‌ 62వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

 ఎన్నికల ఫలితాలపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. సబ్‌ కా సాథ్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌ కా విశ్వాస్‌ కలిస్తే విజయీ భారత్‌ అని మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.

 లఖ్‌నవూలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గెలుపొందారు.

 కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో చంద్రబాబు విజయం సాధించారు

 నిజామాబాద్‌ లోక్‌సభ తెరాస అభ్యర్థి కె.కవిత 60వేల పైచిలుకు ఓట్ల వెనుకంజలో ఉన్నట్లు అనధికార సమాచారం.

 కర్ణాకటలోని తుమకూరు లోక్‌సభ నియోజకవర్గంలో మాజీ ప్రధాని దేవేగౌడ ఓడిపోయారు. ఈ స్థానంలో భాజపా అభ్యర్థి బసవరాజ్‌ గెలుపొందారు.

 వారణాసిలో ప్రధాని మోదీ విజయం: వారణాసి లోక్‌సభ నియోజకవర్గంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ఘన విజయం సాధించారు

 తాడేపల్లి: వైకాపా అధ్యక్షుడు జగన్‌ నివాసానికి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన ఆయనకు అభినందనలు తెలిపారు.

 షాలిని యాదవ్‌పై 4లక్షల ఓట్ల మెజార్టీతో మోదీ గెలుపొందారు.

 కడప లోక్‌సభ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి గెలుపొందారు.

 విజయవాడ పార్లమెంటు : 6 రౌండ్లు పూర్తి, 921 ఓట్ల ఆధిక్యంలో తెదేపా

 రాజమండ్రి గ్రామీణం టీడీపీ గోరంట్ల బుచ్చియ్య చౌదరి విజయం

 విజయవాడ మధ్య : 7 రౌండ్లు పూర్తి 4847 ఓట్ల ఆధిక్యంలో వైకాపా

తూ.గో. పెద్దాపురంరలో చినరాజప్ప విజయం

  నందిగామ:  రౌండ్లు పూర్తి ,2706 ఓట్ల ఆధిక్యంలో వైకాపా

 విజయవాడ తూర్పు :14 రౌండ్లు పూర్తి 9467 ఓట్ల ఆధిక్యంలో తెదేపా

 తూ.గో. రాజానగరంలో వైకాపా అభ్యర్థి జక్కంపూడి రాజా విజయం

 కృష్ణా జిల్లా, పామర్రు వైసీపీ అభ్యర్థి కైలే అనిల్ , 32,961 ఓట్ల మెజారిటీతో గెలుపు

 రాజమండ్రి అర్బన్ టీడీపీ ఆదిరెడ్డి భవానీ 30,436 ఓట్లు తో విజయం

 అనంతపురం జిల్ల్లా..... -పుట్టపర్తి అసెంబ్లీలో 12 రౌండ్స్ పూర్తి...వైసీపీ ఓట్లు 67,222. టీడీపీ ఓట్లు 46,351...వైసీపీ ఆధిక్యం 20,871.

హిందూపూర్ అసెంబ్లీ 7రౌండ్స్ పూర్తయ్యేసరికి టీడీపీకి 34,816, వైసీపీకి 26,894 ఓట్లు.... టీడీపీ ఆధిక్యం 7,922 ఓట్లు...




మరింత సమాచారం తెలుసుకోండి: