జగన్ కు ఆంధ్రప్రదేశ్ కు పట్టంగట్టారు.  అనుకున్న సీట్లు కంటే భారీ స్థాయిలో స్థానాలు వచ్చాయి.  ఈ గెలుపుతో వైకాపా ఓ రికార్డును సృష్టించింది.  ఎన్నికల సమయంలో వైకాపా నవరత్నాలు పేరుతో మ్యానిఫెస్టో రూపొందించింది.  ఈ మ్యానిఫెస్టో ప్రకారం వైకాపా విజయం సాధించింది.  పాదయాత్ర సమయంలో ప్రజలు పడిన కష్టాలు, ప్రజల సమస్యలను తెలుసుకున్న జగన్, వాటిపై దృష్టిపెట్టారు.  


ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఇచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారు అన్నదానిపైనే అందరి దృష్టి ఉండటం విశేషం. ఎలాగైతే అధికారంలోకి వచ్చారో... వచ్చిన తరువాత ఇచ్చిన హామీలను కూడా అలాగే నెరవేర్చితే విజయం వచ్చే ఎన్నికల్లో కూడా విజయం వైకాపా సొంతం అవుతుంది.  లేదంటే మాత్రం భంగపడక తప్పదు.  


నిరుద్యోగం, చదువు, ప్రత్యేక హోదా, రుణమాఫీ వంటి వాటిని ప్రధానంగా పాదయాత్రలో హామీలు ఇచ్చారు.  అలాగే మ్యానిఫెస్టోలో సైతం వాటిని పేర్కొన్నాడు.  ఇప్పుడు వీటిని నెరవేర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది.  ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రం చేతిలో లేదు కాబట్టి, కేంద్రంతో ఎలా కోట్లాడి తీసుకొస్తాడో చూడాలి.  ప్రత్యేక హోదా తీసుకొస్తే జగన్ కు తిరుగు ఉండదు.  చూద్దాం ఏం జరుగుతుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: