తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. ఏడుగురు నాయకులు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి ఓటమిపాలైన వారు ఎంపీలుగా పోటీ చేసి గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఒక నియోజకవర్గ పరిధే అయినా వారు గెలవలేకపోగా ఎంపీగా ఏడు అసెంబ్లీ పరిధిలోని విజయసాధించడం వారిని అదృష్టం వరించినౖట్లెంది. పార్లమెంట్‌లో తమ వాణిని వినిపించే అవకాశం దక్కింది. బీజేపీ నేతలకు అయితే కేంద్రంలోనూ ఆ పార్టీ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చినందున వారికి కేంద్ర మంత్రివర్గంలో దక్కే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో వారికి ఎమ్మెల్యేగా ఓటమిపాలైన వారి అనతి కాలంలో రాజకీయంగా మరో అరుదైన అవకాశాన్ని ప్రజలు కల్పించారు. దీంతో ఎమ్మెల్యేగా ఓడి ఎంపీ కావడం వారి అదృష్టాన్ని తెలుపుతుంది. 

గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా చెన్నూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసిన వెంకటేశ్‌ నేతకాని ఆ తరువాత జరిగిన పరిణామాల్లో టీఆర్‌ఎస్‌లో చేరి పెద్దపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసిన గెలుపొందారు. నల్గొండ అసెంబ్లీ అభ్యర్థిగా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కొమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఓటమి పాలై లోక్‌సభ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. కొడంగల్‌ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిన రేవంత్‌ రెడ్డి ఆ తరువాత లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నుంచి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. మాజీ ఎమ్మెల్యే సోయంబాపూరావు అదిలాబాద్‌ జిల్లా బోథ్‌ అసెంబ్లీ నుంచి కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో బీజేపీలో చేరి ఎంపీగా పోటీ చేసి అనుహ్యంగా గెలుపొందారు. ఖమ్మం అసెంబ్లీ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వర్‌రావు అక్కడ ఓడిపోయాక టీఆర్‌ఎస్‌లో చేరిన ఖమ్మం ఎంపీగా పోటీ చేసి విజయ ఢంకా మోగించారు.


బీజేపీకి చెందిన కిషన్‌ రెడ్డి అంబర్‌పేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. కరీంనగర్‌ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన బండి సంజయ్‌ ఓటమిపాలయ్యారు. వెంటనే వచ్చిన లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఇలా అతి తక్కువ కాలంలోనే రాజకీయంగా అరుదైన అవకాశాలు దక్కడం అదృష్టంగా చెప్పవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: