అత్యంత ఆసక్తి రేపిన నియోజక వర్గాల్లో నెల్లూరు సిటీ నియోజక వర్గం ఒకటి. అయితే ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ నారాయణ మీద సంచలన విజయాన్ని నమోదు చేశారు. రాష్ట్రంలో అత్యంత ఖరీదైన నియోజకవర్గంగా దీనిని చెప్పుకోవచ్చు. అందుకు కారణం.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మంత్రి నారాయణ పోటీ చేస్తూ ఉండటమే!


ప్రత్యక్ష రాజకీయాల వైపు వచ్చాకా టీడీపీ తరఫున నామినేటెడ్ పదవిని తీసుకుని మంత్రి అయ్యారు నారాయణ. అలా తెలుగుదేశంపై తనకున్న పట్టేమిటో నిరూపించుకున్నారు. అయితే నారాయణ గెలవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు. అనిల్ కుమార్ యాదవ్ మీద ఒక ఫేక్ వీడియోను సృష్టించి చివరికి అభాసులపాలైయ్యారు. అయితే నారాయణ ఆర్ధికంగా బలమైన నేత అని చెప్పాలి. 


నెల్లూరు అర్బన్ సీట్లో టీడీపీ  ఓట్ల కొనుగోలును  భారీగా చేసిందని తెలుస్తుంది. పార్టీ కండువా కప్పుకుని తిరిగే వారుంటే ఇంటికి పదివేలు కూడా ఆర్థికశక్తి గట్టిగా ఉన్న అభ్యర్థి బంపర్ ఆఫర్ ఇచ్చేశారు. పోలింగ్ నాటికి ఓటుకు  పదివేల రూపాయలు ఇచ్చారు .. ఇప్పటికే ఇంటింటికి సెల్ ఫోన్ ఐదువేలు పంచారని అక్కడ వినిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే మహిళలకు వెండి పాత్రలు కూడా ఇచ్చి ఓట్ల కోసం ప్రమాణాలు వేయించుకుంటున్నారు టీడీపీ నేతలు. అయినా నారాయణ ఓడిపోవటం అసలు జీర్ణించుకోలేక పోతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: