మళ్ళీ కింగ్ అనిపించుకున్నారు సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. పదేళ్ళ తరువాత తనదైన రాజకీయాన్ని ఆయన చూపబోతున్నారు. విజయనగరం జిల్లాలో తొమ్మిదికి తొమ్మిది సీట్లు వైసీపీకి రావడానికి తెరవెనక చక్రం తిప్పిన బొత్స చీపురుపల్లిలో పాతిక వేలకు పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014 ఎన్నికల సందర్భంగా ఆయన మూడవస్థాననికి పడిపోయారు. అక్కడే ఇపుడు ఆయన మళ్ళీ నిలిచి గెలిచారు.


ఇక్కడ నుంచి పోటీకి దిగిగా మాజీ మంత్రి కిమిడి మ్రుణాళిని కుమారుడు నాగార్జునకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే పనిచేశారని భోగట్టా. దాన్ని అనువుగా తనకు వీలుగా మలచుకున్న బొత్స అతి సులువుగా భారీ మెజారిటీ కొట్టేశారు. చీపురుపల్లిలో బొత్సకు మంచి పట్టు ఉంది. దానికి రుజువే తాజా విజయం.


ఇక్కడ మంత్రిగా పనిచేసిన  మ్రుణాళిని పట్ల పార్టీలో తీవ్ర వ్యతిరేకత  ఉంది. దాన్ని గుర్తించని అధినాయకత్వం ఆమెకే టికెట్ ఇవ్వడంతో బొత్స కి గెలుపు ముందే ఖాయమైంది. ఇక మెజారిటీ బాగా పెంచుకున్న బొత్స తన విజయంతో ఎంపీ గెలుపునకు కూడా దోహదపడ్డారని చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: