ఈశాన్య రాష్ట్రాల్లో రాజ‌కీయ చైత‌న్యంతో ఆస‌క్తి రేకెత్తించే రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్ ఒక‌టి. ఈ రాష్ట్రంలోని నాలుగు లోక్‌సభ స్థానాలకు చివరి దశలో ఈ నెల 19న పోలింగ్ జరిగింది.  తాజాగా వెలువ‌డిన ఫ‌లితాల్లో నాలుగుకు నాలుగు స్థానాలు బీజేపీ గెలుచుకుంది. త‌ద్వారా ఈశాన్య రాష్ట్రాల్లో త‌న‌కున్న ప‌ట్టును చాటుకుంది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని నాలుగు సీట్లను బీజేపీ గెలుచుకుంది. 1989 నుంచీ జరిగిన పార్లమెంటు ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ఒక్క 1991లోనే కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు చెరో రెండు సీట్లు కైవసం చేసుకున్నాయి. కిందటి పార్లమెంటు ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా, ఇప్పుడు కాషాయ ప్రభుత్వ పాలన సాగుతోంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 53.8 శాతం ఓట్లతో నాలుగు సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌ 41 శాతం ఓట్లు సాధించినా ఒక్క సీటూ దక్కించుకోలేకపోయింది. రాజధాని సిమ్లాతోపాటు మండీ, కాంగ్ఢా, హమీర్‌పూర్‌ లోక్‌సభ స్థానాలకు బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య హోరాహోరీ పోరు సాగింది.



కాంగ్రెస్, బీజేపీ మధ్య గట్టి పోటీ జరుగుతున్న మరో నియోజకవర్గం హమీర్‌పూర్‌. ఎప్పుడూ ఠాకూర్లే గెలిచే ఈ స్థానం నుంచి బీజేపీ సిట్టింగ్‌ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ ఇప్పటికి వరుసగా మూడుసార్లు ఎన్నికయ్యారు. తాజా ఎన్నిక‌ల్లోనూ ఆయ‌నే గెలుపొందారు. మాజీ సీఎం ప్రేమ్‌కుమార్‌ ధూమల్‌ కుమారుడైన అనురాగ్‌ ఇంతకు ముందు క్రికెట్‌ కంట్రోల్‌ బోర్డు అధ్యక్షునిగా పనిచేశారు. ఆయన బీజేపీ టికెట్‌పై నాలుగోసారి పోటీకి దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి రామ్‌లాల్‌ ఠాకూర్‌ పోటీచేస్తున్నారు. ఆయనకు గతంలో రాష్ట్ర మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. రాష్ట్ర కబడ్డీ జట్టులో సభ్యునిగా ఆయన ఆరుసార్లు జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నారు. 1998 నుంచీ బీజేపీ అభ్యర్థులే గెలుస్తున్న ఈ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది. అనురాగ్‌ తండ్రి ధూమల్‌ కూడా గతంలో ఇక్కడి నుంచి మూడుసార్లు గెలిచారు. 44 ఏళ్ల అనురాగ్‌ 2014లో తన సమీప అభ్యర్థి రాజేంద్ర రాణాను 98 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో ఓడించారు. నాలుగోసారి విజయం సొంతం చేసుకున్నారు. అనురాగ్‌కు ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామ్‌లాల్‌ గట్టి పోటీ ఇచ్చిన‌ప్ప‌టికీ...ఫ‌లితం లేకుండా పోయింది.


మరింత సమాచారం తెలుసుకోండి: