దేశంలోనే అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తర ప్రదేశ్‌లోనూ బీజేపీ ప్రభంజనం కొనసాగింది. యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. అందులో భాజపా కూటమికి 64 సీట్లుపైగా వచ్చాయి. చేతులు కలిపిన తూర్పు, పడమర దిక్కుల్లాంటి ఎస్పీ, బీఎస్పీ బీజేపీ ప్రభంజనాన్ని అడ్డుకోలేక చతికలపడ్టాయి. 


కాకపోతే గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ 73 స్థానాలు సంపాదించుకుంటే.. ఈసారి ఓ తొమ్మిది సీట్లు తగ్గాయి. ఎస్పీ,బీఎస్పీ రెండూ చేతులు కలిపినా.. కేవలం 15 సీట్లుమాత్రమే సాధించాయి. ఎస్పీ ఐదు, బీఎస్పీ, పది స్థానాలు గెలుచుకున్నాయి. ఇక కాంగ్రెస్ కేవలం ఒకే ఒక్క స్థానం గెలుచుకుంది. 

ఏకంగా రాహుల్ గాంధీ అమేధీలో ఓడిపోగా.. సోనియా మాత్రం రాయ్ బరేలీని నిలబపెట్టుకుంది. ప్రధాని మోదీ వారణాసిలో గెలిచారు. సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి షాలిని యాదవ్‌పై 4 లక్షలకుపైగా మెజార్టీతో జయభేరి మోగించారు. లఖ్‌నవూలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘన విజయం సాధించారు. 

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్‌ గాంధీపై సంచలన విజయం సాధించారు. కమలదళం సత్తాచాటినప్పటికీ ఆ పార్టీకి చెందిన కొందరు ప్రముఖులు ఓటమి పాలయ్యారు. ఎస్పీ, బీఎస్పీ కూటమి, కాంగ్రెస్ వేరువేరుగా పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్ల చీలిక బీజేపీకి లాభించింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: