ఏపీలో పసుపు కుంకుమ, పవన్ కళ్యాణ్, వైసీపీ రాజకీయ సలహాదారు ప్రశాంత్ కిషోర్, ఇలా మూడు పీకేలు తెగ పాపులర్ అయ్యాయి. ఏ పీకే మాట జనం విన్నారో అర్ధం కాక 43 రోజుల పాటు జనం తెగ టెన్షన్ పడ్డారు. అదే సమయంలో ఈవీఎంల మొరాయింపు, పొద్దున ఎండలు, దాంతో సాయంత్రం అయ్యేసరికి క్యూలు కట్టేశారు పెద్ద ఎత్తుల మహిళలు.


వారు తన పిలుపు విని పోలింగ్ బూత్ లకు వచ్చారని  చంద్రబాబు చెప్పుకున్నారు. రాక్షసుల పాలన నుంచి ఏపీని కాపాడాలని పొరుగు  రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా టీడీపీకి ఓటేశారని కూడా ఆయన చెప్పారు. కౌంటింగ్ జరిగేంతవరకూ ఇదే నిజమని అంతా నమ్మారు. తమ్ముళ్ళు సైతం ఇదే కరెక్ట్ అనుకున్నారు.


తీరా నోళ్ళు తెరచిన ఈవీఎం లు అసలు గుట్టు చెప్పేశాయి. ఈవీఎంలు మొరాయించి పోలింగ్ ఆలశ్యం అయింది ఏపీలో 74 పోలింగ్ బూతుల్లో మాత్రమే. అందులో 62 బూతుల్లో ఫలితాలు వైసీపీకి ఓ సునామీ లా వచ్చాయి. కేవలం పన్నెండు పోలింగ్ బూతుల్లోనే టీడీపీకి అనుకూలత కనిపించింది. దీన్ని బట్టి అర్ధరాత్రి నుంచి తెల్లారుజాము దాకా మహిళలు క్యూలు కట్టి నిలబడింది గొప్ప మార్పు కోసమే. ఆ మార్పే జగన్. అందుకే ఇంతటి పెద్ద ఎత్తున వైసీపీకి పాజిటివ్ గా  ఫలితాలు వచ్చాయి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: