ఎంతో ఉత్కంఠ రేపిన ఏపీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వైసీపీకి అనుకూలంగా పూర్తి ఏక‌ప‌క్షంగా వ‌చ్చేశాయి. వైసీపీ ఎవ్వ‌రి అంచ‌నాల‌కు అంద‌ని విధంగా ఏకంగా 153 సీట్ల‌లో వ‌న్‌సైడ్‌గా గెలిచింది. ఇక మొత్తం 175 సీట్ల ప‌రంగా మెజార్టీ చూస్తే వైసీపీ అధినేత జ‌గ‌న్ టాప్ ప్లేస్లో ఉన్నారు. జ‌గ‌న్ 90 వేల ఓట్ల పై చిలుకు మెజార్టీతో గెలిస్తే.. లీస్ట్ మెజార్టీ విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నుంచి పోటీ చేసిన మ‌ల్లాది విష్ణుది. ఆయ‌న బొండా ఉమాపై 25 ఓట్ల తేడాతో విజ‌యం సాధించారు. ఏకంగా 21 మంది వైసీపీ అభ్య‌ర్థులు 40 వేల ఓట్ల పైచిలుకు మెజార్టీలు సాధించారు. ఇక నలుగురు అభ్యర్థులు వెయ్యిలోపు ఆధిక్యంతో బయటపడ్డారు. వీరిలో వైసీపీ నుంచి ఇద్దరు.. ఒకరు టీడీపీ, ఒకరు జనసేన పార్టీకి చెందిన వారు.


టాప్ మెజార్టీల లిస్ట్ చూస్తే
- పులివెందుల - వైఎస్‌. జ‌గ‌న్ -  90110 
- గిద్దలూరు - అన్నా రాంబాబు - 81035 
- సూళ్లూరుపేట - కిలివేటి సంజీవయ్య - 61292 
- అనపర్తి - డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి - 55207 
- కడప - అంజాద్‌ భాషా - 54794 
- జమ్మలమడుగు - మూలె సుధీర్‌రెడ్డి - 51641 
- గుంతకల్ - వెంకటరామిరెడ్డి - 48532 
- తంబళ్లపల్లె - పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌ రెడ్డి - 46938 
- శింగనమల - జొన్నలగడ్డ పద్మావతి - 46242 
- గంగాధర నెల్లూరు - కె. నారాయణస్వామి - 45594 
- గూడూరు - వెలగపల్లి వరప్రసాదరావు - 45458 
- సత్యవేడు - కోనేటి ఆదిమూలం - 44744 
- బద్దేల్ - జి. వెంకట సుబ్బయ్య - 44734 
- పాణ్యం - కాటసాని రాంభూపాల్‌ రెడ్డి - 43857
- పుంగనూరు - పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి - 43555 
- ప్రొద్దుటూరు - రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి - 43148 
- పాడేరు - భాగ్యలక్ష్మి కొత్తగుల్లి - 42804 
- పోలవరం - తెల్లం బాలరాజు - 42070 
- పత్తికొండ - కంగటి శ్రీదేవి - 42065 
- చంద్రగిరి - చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి - 41755 
- నందికొట్కూరు - తొగురు ఆర్థర్ - 40610 
- కనిగిరి - బుర్రా మధుసూదన్‌ యాదవ్ - 40903 


లీస్ట్ మెజార్టీలు :
- విజయవాడ సెంట్రల్ - మల్లాది విష్ణు - 25 ఓట్ల అతి స్వల్ప మెజారిటీ
- తిరుపతి - భూమన కరుణాకర్‌రెడ్డి - 708 
- రాజోలు - రాపాక వరప్రసాద్ - 814 
- గన్నవరం - వల్లభనేని వంశీ - 838


మరింత సమాచారం తెలుసుకోండి: