తెలుగుదేశం పార్టీని ఎవరు ఓడించారు. అంటే సమాధానం సింపిల్. ఏపీ ప్రజలు ఓడించారు. కానీ ఆ పార్టీలో ఇపుడు అంతర్మధనం సాగుతోంది. టీడీపీ చరిత్రలో ఇంత చెత్త పెర్ఫార్మెన్స్ ఎపుడూ లేదు. 23 సీట్లు రావడమేంటి. చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా ఈ ఘోర పరాజయం ఏంటి.


ఇపుడు ఇదే పార్టీలో చర్చగా ఉంది. టీడీపీని ఓడించింది ఎవరు అంటే పది రకాలుగా చెబుతారు కానీ. టీడీపీని ఓడించింది ఎవరో కాదట చంద్రబాబేనట. అదేమంటే బాబు పార్టీని కీలక టైంలో అసలు పట్టించుకోలేదు. గత ఏడాదిగా ఆయన గాలి తిరుగుళ్లే తిరిగారు. అంటే విమానల్లో ఢిలీ, హైదరాబాద్, కర్నాటక, బెంగుళూర్ ఇలా అన్ని చోట్ల చక్కర్లు కొట్టారు.


ఏపీలో పార్టీని మాత్రం గాలికే వదిలేశారు. ఓ వైపు బలమైన నేతగా జగన్ నెలల తరబడి జనంలో దూసుకుపోతూంటే బాబు మాత్రం దేశంలో విపక్షాలను ఏకం చేస్తామంటూ బీరాలు పోయారు. నిజానికి తెలంగాణా ఎన్నికల్లో బాబు వేలి పెట్టు ఉండకూడదన్నది  తమ్ముళ్ళ అభిప్రాయం. అలాగే కర్నాటక గొడవలు, బెంగాల్ దీదీ తో అంటకాగడాలు ఇవన్నీ తగ్గించుకుని ముందు ఏపీలో పార్టీని నిలబెట్టుకుని ఉంటే కధ వేరేగా ఉండేదని తమ్ముళ్ళు తాపీగా చింతిస్తున్నారు.


నేనే ఢిల్లీలో చక్రం తిప్పుతాను అంటూ అయాసపడిన బాబుకు ఇపుడు ఏపీలో కూడా చక్రం విరిగిపోయిదని సెటైర్లు పడుతున్నాయి. ఏపీలో బాబు ఓటమి ఖాయమని ఏడాదిగా సర్వేలు కోడై కూస్తున్న వేళ కూడా బాబు వాటిని పట్టించుకోలేదు. లైట్ తీసుకున్నారు. ఇదే మాట అమిత్ షా అంటూ ఇక్కడ తిరిగేది ఏదో  ఏపీలో తిరిగి ఉంటే బాబుకు ఏపీలో నాలుగు సీట్లు ఎక్కువ వచ్చి ఉండేవని ఎద్దేవా చేశారు. మరి ఇప్పటికైనా బాబు సొంత ఇల్లు చక్కబెట్టుకుంటారా..


మరింత సమాచారం తెలుసుకోండి: