రాజకీయాల్లో సినీ తారలు ఎంటర్ ఇవ్వడం చూస్తూనే ఉన్నాం.  ఇప్పటి వరకు ఎంతో మంది సినీ నటీ, నటులు రాజకీయాల్లోకి వచ్చి తమ సత్తా చాటారు.  కొంత మంది ఏకంగా కొత్త ప్రాంతీయ పార్టీలే స్థాపించి జయకేతనం ఎగుర వేశారు.  అలాంటి వారిలో నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) తెలుగు దేశం పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా తెలుగు ప్రజల మనస్సులో సుస్థిర స్థానం సంపాదించారు.  తమిళనాట ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీ స్థాపించి ముఖ్యమంత్రిగా తమిళ తంబీల మనసు దోచారు. 


ఆ మద్య విశ్వనటుడు కమల్ హాసన్ కూడా ఓ పార్టీ స్థాపించి ఇటీవల వెలువడిన ఫలితాల్లో దారుణమైన ఓటమి చవిచూశాడు.  ఇలా ఎంతో మంది సొంత పార్టీలు స్థాపించి దారుణ ఫలితాలు పొందారు.  ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలుగు చిత్రసీమతో సంబంధం ఉన్న నటులు సత్తా చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి పోటీచేసిన వీరంతా తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు.


వీరిలో సీనియర్ నటి సుమలత, అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమాలోని విలన్ పాత్రధారి రవికిషన్, యమదొంగ, శ్రీను వాసంతి లక్ష్మీ, మహారథి వంటి సినిమాల్లో నటించిన నవనీత్ కౌర్ ఉన్నారు. భోజ్‌పురి, బాలీవుడ్ సినిమాలతో పలు తెలుగు సినిమాల్లో నటించిన రవికిషన్.. రేసుగుర్రం సినిమాలో విలన్‌గా మెప్పించారు. కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో కర్ణాటకలోని మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన సుమలత ఒకప్పటి టాప్ హీరోయిన్లలో ఒకరు. చిరంజీవి సరసన పలు సినిమాల్లో నటించిన ఆమె ఖైదీ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో  నటించారు. 


ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలో ఓ పాటలో నర్తించిన నవనీత్ కౌర్ ఆ తర్వాత మరిన్ని సినిమాల్లోనూ నటించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. యువ స్వాభిమానీ పక్ష తరపున శివసేన సిట్టింగ్ ఎంపీ ఆనంద్‌రావ్‌పై  30 వేల మెజారిటీతో విజయం సాధించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: