యంగెస్ట్‌ ఎంపీ, గిరిజన యువతి ఈ సారి పార్లమెంట్‌ ఎన్నికల్లో తెలుగురాష్ట్రాల్లో యంగెస్ట్‌ ఎంపీగా, అరకు పార్లమెంటరీ నియోజక వర్గం నుండి వైఎస్సార్‌ సీపీ నుండి పోటీ చేసి గెలిచిన జి.మాధవి(33) గుర్తింపు పొందారు.

ఎమ్యెల్యేగా పోటీ చేసిన మహిళల్లో వైఎస్సార్‌ సీపీ నుండే పోటీ చేసి గెలుపొందిన గుంటూరు జిల్లా ,చిలకలూరిపేట నియోజక వర్గం అభ్యర్ది వి.రజనీ వయస్సు 30 సంవత్సరాలు.

 దేశవ్యాప్తంగా ...

 ఒడిశాలోని కియోంజహార్‌ స్థానం నుంచి గెలిచిన చంద్రాని మూర్ము అనే యువతికి అతి తక్కువ వయస్సున్న ఎంపీగా గౌరవం దక్కింది. గిరిజన ప్రాబల్యం ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో 25సంవత్సరాల వయసున్న ఇంజినీరింగ్‌ పట్టభద్రురాలు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 

'' కియోంజహార్‌ ప్రాంతంలో ఉద్యోగాల స ష్టిపైనే తాను ప్రధానంగా దష్టి పెట్టానని చెప్పారు. కొత్త పరిశ్రమలు తీసుకురావడానికి ఉన్న ఏ చిన్న మార్గాన్ని వదులుకోనన్నారు. రాష్ట్రంలోని యువత, మహిళల ప్రతినిధిగా పార్లమెంటులో గళం వినిపిస్తానని' చంద్రాని పేర్కొన్నారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న తాను అనుకోకుండా లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చిందని చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: