రాజ‌కీయాల్లో ఓట‌మి ఎలాంటి ప‌రిస్థితుల‌ను సృష్టిస్తుందో తెలియ‌జెప్పేందుకు ఇదే నిద‌ర్శ‌నం. ఓట‌మిని జీర్ణించుకోవ‌డం నాయ‌కుల‌కు ఎంత క‌ష్ట‌మో...త‌మ అభిమాన నేత ఓడిపోయార‌నే బాధ‌ను స‌ద‌రు నేత కార్య‌కర్త‌ల‌ను జీర్ణించుకోవ‌డం కూడా అంతే క‌ష్టం. అలా ఓట‌మిని త‌ట్టుకోలేని ఓ కార్య‌క‌ర్త‌ల స‌ద‌రు నేత పీఏపై దాడి చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన క‌విత పీఏపై ఆమె అభిమాని ఒక‌రు దాడి చేశార‌ని సోష‌ల్ మీడియ‌లో వైర‌ల్ అవుతోంది.


సోష‌ల్ మీడియాలో ప్ర‌చారంలో ఉన్న మెసేజ్ ఇదే...
``కవిత పి ఎ పై దాడి ?.??
నిజామాబాద్ మాజీ ఎంపి కవిత పి ఎ శరత్ పై ఆమె ఇంటికి వచ్చిన అభిమానుల్లో ఒకరు దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది , శనివారం ఉదయం మాదాపూర్ లోని కవిత ను కలవడానికి ఆమె అభిమానులు వచ్చారు, అక్కడే ఉన్న కవిత పి ఎ శరత ను చూడగానే కోపోద్రిక్తులైన అభిమానులు వాదనకు దిగారట , బండ బూతులు తిడుతూ మీ ప్రవర్తనతో మా అక్క ఓటమికి కారకులైనారు కదరా అంటూ ఓ అభిమాని పిడిగుద్దులు గుద్దారట , తీవ్రంగా చితకబాదేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడ ఉన్న వారు వారించారట , కవిత ఇంటి ముందే జరిగిన ఈ సంఘటన కవిత దృష్టికి వెల్లడం తో కోపం తో ఊగిపోతున్న తన అభిమానులను లోపలికి పిలిచి కూర్చోబెట్టి సముదాయించారట , బయటికి వచ్చిన అభిమానులు నవీనాచారీ కోసం ఎదురు చూశారట , మా అక్క నవీనా చారీ ని ఎక్కువ నమ్మిందని వాడు అంతా తప్పుడు సమాచారం ఇస్తూ , ఎన్ ఆర్ ఐ ల దగ్గర ఐ ఫోన్ లు , ఎలక్ట్రానిక్ , విలువైన వస్తువులకు ఆశపడి నిజమైన కార్యకర్తలను అక్క కు దూరం చేశాడని , వాడి పిచ్చి చేస్టలు ల వల్ల కష్టకాలం లో అక్కతో ఉన్న వారు ఎం పి అయ్యక అక్కను విడిచి వెళ్ళారని , వాడు ఇక్కడికి వస్తే తన్నిపోదామని చాల సేపు ఎదురు చూశారట , అతడు నివాసముండే బోయిన్ పల్లి కి వెల్లి తందామని అనుకున్నారట కాని అక్క ఇంటి ముందే వాడిని తన్నాలని చాలాసేపు చూసి , ఆకలి కావడం తో వెళ్ళిపోయారట , అనంతరం శరత్ వాడుతున్న సిం ను తీసుకొని ఇంకోసారి ఇటు రావద్దని కవిత సిబ్బంది శరత్ ను ఇంటి నుంచి పంపించారట...``పై సోష‌ల్ మీడియా సందేశంలో నిజ‌మెంతో ....అబ‌ద్ద‌మెంతో తేలాలంటే... క‌విత వ‌ర్గీయులు ఎవ‌రైనా స్పందించాల్సిందే. 



మరింత సమాచారం తెలుసుకోండి: