ఏపీ ముఖ్యమంత్రి జగన్ తన విజయం తర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించేందుకు హైదరాబాద్ వెళ్లిన సంగతి తెలిసిందే. బేగంపేట నుంచి సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీసులోకి..ప్రగతి భవన్ లోకి వెళ్లిన జగన్.. సీఎం కేసీఆర్ ను తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. జగన్ ను వైసీపీ ఎల్పీ నేతగా ఎన్నుకున్న ఆ పార్టీ సభ్యులు.. రాజ్ భవన్ లో నరసింహన్ ను కలిసి ఆ మేరకు లేఖ ఇచ్చారు.


చూడటానికి ఇవి చాలా సాధారణమైన సంఘటనలే కానీ.. వీటి వెనుక చాలా ఆసక్తికరమైన ఘటనలు ఉన్నాయి. అదే రోడ్డులో దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం జగన్ ను అక్రమాస్తుల కేసులో అరెస్టు చేశారు.అరెస్టుకు ముందు దిల్ ఖుష్ గెస్ట్ హవుస్ లో చాలా రోజులు విచారించారు. ఆ రోజులన్నీ జగన్ జీవితంలో చాలా చేదు జ్ఞాపకాలు మిగిల్చాయి. 

అదే రోడ్డులో జగన్ ను అరెస్టు చేసి తీసుకెళ్లారు. కొన్ని రోజుల తరబడి జగన్ కు విచారణ పేరుతో నిద్ర లేకుండా చేశారు. ఇప్పుడు అదే రోడ్డులో జగన్ సీఎం హోదాలో అడుగు పెట్టారు.. అందరిచేతా శెభాష్ అనిపించుకుంటున్నారు. అలాగే సీఎం క్యాంప్ ఆఫీసు నుంచి సీఎం కొడుకు హోదాలో బయటకు వచ్చారు జగన్.

ఇప్పుడు అదే క్యాంప్ ఆఫీసులోకి సీఎం హోదాలో అడుగు పెట్టారు.. ఈ పరిణామాలకు కారణం.. ఎన్ని కష్టాలు ఎధురైనా.. సంవత్సరాల తరబడి ఓపికతో జగన్ చేసిన పోరాటమే తప్ప ఇంకొకటి కాదు. ఆ నాటి రోజులను తలచుకుని ఇప్పటి సీన్ చూసి ఔరా జగన్ అంటున్నారు గతం తెలిసిన వారు.


మరింత సమాచారం తెలుసుకోండి: