పవన్ జనసేన పార్టీ ఓటమికి గల కారణాలను అన్వేషించుకోవడం మొదలు పెట్టింది.  ఓటమిపై ఈరోజు పార్టీ ఆఫీస్ లో చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారని సమాచారం.  ఫ్యూచర్ లో పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతున్నది.  ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే విషయాలపై కూడా చర్చించారు.  


అయితే, ఈ సమావేశానికి దాదాపు అందరు హాజరయ్యారు.  ఓ ఇద్దరు నేతలు తప్పా.  ఆ ఇద్దరు జనసేనలో కీలకమైన నేతలే.  ఈ ఇద్దరు పార్టీలో ఉండటం వలన జనసేనకు కాస్త పేరు వచ్చింది.  రాజకీయంగా.  ఆ ఇద్దరిలో ఒకరు జెడి లక్ష్మి నారాయణ.  వైజాగ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేశారు.  


గెలుస్తారని అనుకున్న జెడి ఓడిపోవడంతో పత్తా లేకుండా పోయారు.  రిజల్ట్ తరువాత ఇంతవరకు పార్టీతో టచ్ లో లేరు.  అటు నాదెండ్ల మనోహర్ కూడా పార్టీకి దూరంగా ఉంటున్నారు.  ఈరోజు జరిగిన కార్యక్రమానికి ఇద్దరు హాజరు కాకపోవడంతో అనేక రూమర్లకు తావునిస్తున్నాయి.  


జెడి ఎలాగో జగన్ తో టచ్ లో ఉండడు.  జెడి గెలవలేదు కాబట్టి కొన్నాళ్ళు రెస్ట్ తీసుకొని తరువాత కార్యాచరణ ఏమిటో నిర్ణయించుకుంటారు.  పార్టీలు మారడం అలవాటే కాబట్టి నాదెండ్ల మరో పార్టీలో చేరేందుకు సిద్ధం అవుతుండొచ్చు.  తనతో ఉండాలని అనుకునేవాళ్లు కనీసం పదేళ్లు కలిసి ఉండేలా ప్లాన్ చేసుకోవాలని పవన్ చెప్పడం వెనుక అర్ధం ఏంటో తెలియాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: