ఓటమికి కారణం తెలుసుకుంటే గెలుపునకు అదే బాటలు వేస్తుంది. ఎక్కడ వెనకబడ్డామో అర్ధమైతే ముందుకు వెళ్ళేందుకు మార్గం సుగమం అవుతుంది. ఏ రంగంలోని వారికైనా  ఇదే అచ్చమైన పాఠం. ఇక పోతే రాజకీయ నాయకులకు ఇది చాలా అవసరమైన పాఠం. దీన్నే ఆత్మ విమర్శ అంటారు.


అయితే ఆత్మ విమర్శ కరెక్ట్ గా ఉండాలి. ఏదో మొక్కుబడిగా ఉండకూడదు. పవన్ కళ్యాణ్ జనసేన దారుణమైన పరాజయం పాలైంది. ఐతే రాజకీయాల్లో ఇది మామూలే. కానీ సినిమా నటుడు పెట్టిన పార్టీ, పైగా అభిమానులే కార్యకర్తలు కావడంతో జీర్ణించుకోవాడానికి కొంత సమయం పట్టింది. అది సరే కానీ పార్టీ ముఖ్య నాయకులతో పవన్ కళ్యాణ్ మీటింగ్ పెట్టి ఓటమికి గల కారణాలను తెలుసుకున్నారు. తన ఓటమికి గల కారణాలను కూడా వివరించారు.


పవన్ గాజువాక, భీమవరం నుంచి పోటీ చేశారు. రెండు చోట్లా పెద్ద తేడాతో ఓటమి పాలు అయ్యారు. తాను ప్రచారానికి వెళ్ళలేకపోయానని, సమయాభావం వల్లనే ఇలా జరిగిందని పవన్ చెప్పారు. ఈ విశ్లేషణ నిజమే, కానీ  దీనికి కారణమెవరు. పవన్ కళ్యాణ్ అప్పటికపుడు రాజకీయాల్లోకి రాలేదు కదా. ఆయన పార్టీ పెట్టి అయిదేళ్ళు అయింది. పైగా తాను కచ్చితంగా పోటీ చేస్తానని కూడా ఆయన చెబుతూ వచ్చారు. మరి అలాంటి సందర్భంలో పవన్ తాను పోటీ చేసే అసెంబ్లీ సీటుని ముందుగా ఎంపిక చేసుకుని అక్కడ ఎక్కువ సమయం గడిపితే ఇలాంటి ఫలితం వచ్చేది కాదు కదా.

ఇక్కడో విషయం  ఉంది. సెలిబ్రిటీలు తాము నామినేషన్ వేస్తే చాలు గెలిస్తామని అనుకుంటారు. అది తప్పు అని నాడు చిరంజీవి, ఇపుడు పవన్ నిరూపించారు. ప్రజలకు నిజమైన సేవ ఎవరు చేస్తారు. ఎవరు అందుబాటులో ఉంటున్నారు అన్నదే ఓటరు చూస్తారు, సినీ అభిమానం వేరు నాయకుడికి ఓటు చేయడం  వేరు. ఈ తేడా అర్ధమైతే చాలు పవన్ సహా సెలిబ్రిటీలు ఎవరైనా రాజకీయాల్లో జనం కోసం పూర్తి  టైం వెచ్చిస్తే వారినే ఎన్నుకుంటారు. సో బెస్టాఫ్ లక్ పవన్ 


మరింత సమాచారం తెలుసుకోండి: