ఇరిగేషన్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లు, ఉన్నతాధికారులకు జగన్మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. గడచిన ఐదేళ్ళల్లో ఇరిగేషన్ శాఖలోని ప్రాజెక్టుల్లో జరిగిన అవినితిని ఎవరికి వారుగా బయటపడితే సన్మానిస్తానంటూ  చెప్పారు. చంద్రబాబునాయుడు హాయంలో అనేక ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున అవినీతి జరిగినట్లు ఆరోపణలు వినిపించిన విషయం తెలిసిందే.

 

ప్రతీ ప్రాజెక్టులోను వాస్తవానికి మించి అంచనాలను పెంచేశారని విపరీతమైన ఆరోపణలున్నాయి. ప్రధానంగా రాయలసీమలో అమలులో ఉన్న ప్రతీ ప్రాజెక్టు అందులోను టిడిపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ చేస్తున్న ప్రాజెక్టులపై ఈ విధమైన ఆరోపణలున్నాయి. అంచనాలను పెంచేసి ప్రాజెక్టులు చేపడుతున్నట్లు బిజెపి నేతలు రాయలసీమ వ్యాప్తంగా పర్యటనలు చేసి మరీ నిర్ధారించారు.

 

అందుకనే జగన్ సమీక్షలో మాట్లాడుతూ అధికారులకు, ఇంజనీర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టులపై తాను థర్డ్ పార్టీ తో రివ్యూలు చేయిస్తానన్నారు. ఆ నివేదిక వచ్చేంతలోగా శాఖపరమైన ఇంజనీర్లు జరిగిన వాస్తవాలేంటో వారంతట వారుగా నివేదిక రూపంలో ఇవ్వాలని ఆదేశించారు.  లేకపోతే అందరి మీదా చర్యలుంటాయని హెచ్చరించారు. డబ్బులు తిన్నది ఒకరైతే చెడ్డ పేరు వచ్చింది మాత్రం మరొకరికి అన్న విషయాన్ని స్పష్టం చేశారు.

 

ఈ నింద పోవాలంటే డబ్బులు తిన్నది ఎవరు ? ఎవరి కోసం అంచనాలు పెంచాల్సొచ్చింది ? అన్న వివరాలను వెంటనే తనకు అందివ్వాలని చెప్పారు. నిజంగా జగన్ ఇచ్చిన బంపర్ ఆఫర్ బాగానే ఉంది. ఇంజనీర్లు, ఉన్నతాధికారులకు మాత్రం టిడిపి నేతలను రక్షించాల్సిన అవసరం ఏముంటుంది ? అప్పట్లో చంద్రబాబునాయుడు చెప్పటంతో ఇష్టం ఉన్నా లేకపోయినా చెప్పినట్లు చేశారు. ఇపుడు జగన్ అధికారంలోకి వచ్చాడు కాబట్టి జగన్ చెప్పినట్లు వింటారు.

 

జగన్ ప్లాన్ ప్రకారం అధికారుల వేలితోనే చంద్రబాబు కన్ను పొడవాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగానే కాంట్రాక్టర్లైన టిడిపి నేతలపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు కనబడుతోంది. ఏ పరిస్ధితుల్లో అంచనాలు పెంచాల్సొచ్చింది అన్న విషయాలను అధికారులు, ఇంజనీర్లు నివేదిక రూపంలో చెబితే టిడిపి కాంట్రాక్టర్ల పని గోవిందా.

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: