``మాది జాతీయ పార్టీ. రాష్ట్రంలోనే కాదు.. కేంద్రంలోనూ చ‌క్రం తిప్పుతాం!`` అంటూ.. టీడీపీ అధినేత‌గా చంద్ర‌బాబు ఈ ప్ర‌క‌ట‌న చేసి ఏడాది(గ‌త ఏడాది మేలో నిర్వ‌హించిన మ‌హానాడులో చంద్ర‌బాబు ప్ర‌సంగం) గ‌డ‌వ కుండానే ఆ పార్టీకి చే టు కాలం వ‌చ్చిందా?  తాజాగా జ‌రిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత పార్టీ మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం ఏర్ప డుతోందా?  కీల‌క‌మైన నాయ‌కులు పార్టీకి దూర‌మ‌వుతున్నారా?  త్వ‌ర‌లోనే పార్టీ కూసాలు క‌ద‌ల‌బోతున్నాయా? అంటే.. అవున‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. రాష్ట్రంలో జ‌రుగుతున్న పొలిటిక‌ల్ చ‌ర్చ‌లు కూడా దీనికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుంది? ఎవ‌రెవ‌రు ప‌క్క చూపులు చూస్తున్నారు? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. 


గ‌డిచిన  రెండు రోజుల నుంచి విజ‌య‌వాడ ఎంపీ కేశినేని నాని చేస్తున్న రాజ‌కీయ ప్ర‌క‌ట‌నలు పార్టీలో ప్ర‌కంప‌న‌లు పుట్టి స్తున్నాయి. పార్టీ పార్ల‌మెంటరీ ప‌ద‌వుల విష‌యంలో త‌లెత్తిన ఈ వివాదం రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో వివా దాన్ని త‌గ్గించేందుకు చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించినా.. ఫ‌లితం క‌నిపించ‌లేదు. పైగా నేరుగా మ‌హారాష్ట్ర వెళ్లిన నాని, అక్క డ ఎంపీగా గెలుపొందిన బీజేపీ సీనియ‌ర్ గ‌డ్క‌రీని అభినందిస్తూ.. పుష్ప గుచ్ఛం అందించ‌డం మ‌రింత వివాదానికి కార ణ‌మైంది. ఈ సెగ‌లు పొగ‌లు ఆర‌క‌ముందే.. టీడీపీ కంచుకోట జిల్లా అయిన అనంత‌పురంలో అల‌జ‌డి ప్రారంభ‌మైంది. ఇక్క‌డ పార్టీని ముందుండి న‌డిపించిన కుటుంబాలే ఇప్పుడు ప‌క్క‌చూపులు చూస్తుండ‌డం మ‌రింత వివాదానికి కార‌ణ‌మైంది. 


అనంత‌పురంలో టీడీపీని వీడ‌కుండా పార్టీని అభివృద్ధి చేసిన కుటుంబం ప‌రిటాల‌. అన్న‌గారు ఎన్టీఆర్ హ‌యాం నుంచి కూడా ప‌రిటాల కుటుంబం ఈ పార్టీతోనే ఉంది. అయితే, 2005లో ప‌రిటాల ర‌వి హ‌త్య అనంత‌రం రాజ‌కీయంగా తెర‌మీదికి వ‌చ్చిన ఆయ‌న స‌తీమ‌ణి.. సునీత‌కు చంద్ర‌బాబు 2014 ఎన్నిక‌ల త‌ర్వాత‌ మంత్రిగాకూడా అవ‌కాశం ఇచ్చారు. ఇక‌, తాజాగా జ‌రిగిన ఎన్నిక్ల‌లో ఆమె అభ్య‌ర్థ‌న మేర‌కు సునీత టికెట్‌ను ప‌రిటాల వార‌సుడు శ్రీరామ్‌కు కేటాయించారు. ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలుస్తాడ‌ని అనుకున్న శ్రీరామ్‌.. జ‌గ‌న్ సునామీలో చ‌తికిల‌ప‌డ్డాడు. ఇక‌, ఇప్పుడు జ‌గ‌న్ త‌న పాల‌న‌లో పార‌ద‌ర్శ‌క‌త‌కు చోటివ్వ‌డం, ప్ర‌జ‌లు ఇప్ప‌టి వ‌రకు ఎక్క‌డా అసంతృప్తి వ్య‌క్తం చేయ‌క పోవ‌డంతో వ‌చ్చే 2024లోనూ టీడీపీ అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. 


ఈ నేప‌థ్యంలో ఇక‌, టీడీపీని ప‌ట్టుకుని ఉండ‌డం వ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నం లేద‌ని గ్ర‌హిస్తున్న టీడీపీలోని కొంద‌రు సీనియ‌ర్లు.. మార్పు దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి వారిలో కేశినేని నాని స‌హా ప‌రిటాల కుటుంబం పేర్లు జోరుగా వినిపిస్తున్నాయి. వీరంతా బీజేపీలోకి చేర‌తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. బీజేపీ కూడా ఏపీలో బ‌ల‌ప‌డాల‌ని భావిస్తున్న నేప‌థ్యంలో ఆ పార్టీలోకి చేర‌డం ద్వారా త‌మ‌కు లైఫ్ ఉంటుంద‌ని నాయ‌కులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ ఏపీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్‌గా ఉన్న రాంమాద‌వ్‌ను వీరుసంప్ర‌దిస్తున్నారు. అయితే, పార్టీలో సీనియ‌ర్లుగా ఉన్న జేసీ బ్ర‌ద‌ర్స్ స‌హా వ‌ర‌దాపురం సూరి వంటివారు ఎటు వైపు అడుగులు వేస్తార‌నేది తేల్చుకున్నాక నిర్ణ‌యం తీసుకుందామ‌ని ప‌రిటాల ఫ్యామిలీ అనుకుంటున్న‌ట్టు స‌మాచారం . ఇదే జ‌రిగితే.. టీడీపీకి వెన్ను విర‌గ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



మరింత సమాచారం తెలుసుకోండి: