శాసననసభ స్పీకర్ గా సీనియర్ ఎంఎల్ఏ తమ్మినేని సీతారంను నియమించాలని జగన్మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు సమాచారం.  ఈ విషయాన్ని జగన్ మీడియానే ప్రముఖంగా ప్రకటించింది. తాజాగా జరిగిన వైఎస్సార్ ఎల్పీ సమావేశం తర్వాత తమ్మినేనిని జగన్ ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడటంతో కొత్త స్పీకర్ గా తమ్మినేనే అన్న విషయం ఒక్కసారిగా ప్రచారం ఊపందుకుంది.

 

తమ్మినేని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బిసి నేత. ఆముదాలవలస నియోజకవర్గ నుండి ఆరు సార్లు గెలిచారు. టిడిపిలో కూడా మంత్రుపదవులు చేసిన తమ్మినేని చాలాకాలంగా వైసిపిలోనే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీ గెలిచారు. ఎంఎల్ఏల్లో కూడా బాగా సీనియర్ కావటం, ఉత్తరాంధ్రలో బలమైన నేత కావటంతో జగన్ మొగ్గు తమ్మినేని వైపుందని సమాచారం.

 

ఇప్పటి వరకూ స్పీకర్ పదవికి కోన రఘుపతి, ఆనం రామనారాయణరెడ్డి, అంబటి రాంబాబు  లాంటి అనేక పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అయితే తాజాగా జగన్-తమ్మినేని భేటీ జరగటంతో తమ్మినేనే అసెంబ్లీ స్పీకర్ గా ఖాయమైనట్లే అనే ప్రచారం మొదలైంది. కాకపోతే ఈ విషయాన్ని జగన్ మీడియా కూడా చెబుతుండటంతో తమ్మినేనే ఖాయమని అనుకుంటున్నారు.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: