ఏపీలో ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తోంది. వైసీపీ అధినేత వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ఈ నెల 30న ఏపీ సీఎంగా కూడా ప్ర‌మాణ‌స్వీకారం చేసి పాల‌నాప‌రంగా సంచ‌ల‌నాత్మ‌క నిర్ణ‌యాల‌తో దూసుకుపోతున్నారు. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ త‌న కేబినెట్ మంత్రుల‌తో ఈ నెల 8న ప్ర‌మాణ‌స్వీకారం చేయిస్తాన‌ని ముందుగానే ప్ర‌క‌టించారు. ఇక తాజాగా శుక్ర‌వారం వైఎస్సార్ఎల్పీ స‌మావేశం నిర్వ‌హించిన జ‌గ‌న్్ కేబినెట్ కూర్పుపై ఓ స్ప‌ష్ట‌త ఇచ్చేశారు. 


త‌న కేబినెట్‌లో మొత్తం 25 మంది మంత్రులు ఉంటార‌ని చెప్ప‌డంతో పాటు ఓవ‌రాల్‌గా ఐదుగురు మంత్రుల‌కు డిప్యూటీ సీఎం హోదా ఉంటుంద‌ని ప్ర‌క‌టించారు. ఈ ఐదుగురు డిప్యూటీ సీఎంల‌లో మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు వ‌ర్గాల‌కు చెందిన వారు కూడా ఉంటార‌ని ఆయ‌న చెప్పారు. అలాగే దేశం మొత్తం మ‌న‌వైపే చేస్తున్నందున ప‌రిపాల‌న‌లోనూ మ‌న‌మే దేశానికి ఆద‌ర్శంగా నిల‌వాల‌న్న విష‌యాన్ని కూడా కేబినెట్ మంత్రుల‌కు స్ప‌ష్టం చేశారు.


ఇక మంత్రివ‌ర్గ ప్ర‌మాణ‌స్వీకారానికి సంబంధించి ఏర్పాట్ల పూర్తి బాధ్యతలను ఏపీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంకు అప్పచెప్పారు. ఏపీ సెక్రటరియేట్ పరిధిలో జరిగే ఈ కార్యక్రమానికి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే కేబినెట్ ఎంపిక‌లో త‌న‌దైన వైవిధ్య‌త చూపించిన జ‌గ‌న్ కేబినెట్ ఏర్పాటుకు ముందే మంత్రుల‌కు ష‌ర‌తులు పెట్టేశారు.


వైసీపీ నుంచి ఏకంగా 151 మంది మంత్రులుగా గెల‌వ‌డంతో ఏకంగా 50 మంది వ‌ర‌కు మంత్రి ప‌ద‌వులు ఆశించే వారు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే రెండున్న‌రేళ్ల త‌ర్వాత ఇప్పుడు మంత్రులుగా ఉన్న వారిలో 90 శాతం మందిని త‌ప్పించి వారి స్థానాల్లో కొత్త వారికి అవ‌కాశ ఇస్తామ‌ని ప్ర‌టించారు. అప్పుడు అంద‌రికి స‌మ‌న్యాయం చేసిన‌ట్ల‌వుతుంద‌ని కూడా జ‌గ‌న్ చెప్పారు. ఇక మంత్రులుగా ఎంపికైన వారు అంద‌రూ పూర్తి పార‌ద‌ర్శ‌క‌త‌తో ప‌ని చేయాల‌ని కూడా జ‌గ‌న్ సూచించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: