టీడీపీ నేతలు ప్రభుత్వం మీద, ఏపీ సీఎం మీద వ్యక్తిగత దూషణకు దిగితే అరెస్టులు తప్పవని ఇప్పటికే ఒక ఎమ్మెల్యేకు జగన్ రుచి చూపించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున విశాఖ తూర్పు నియోజకవర్గం నుంచి ఎన్నికైన వెలగపూడి రామకృష్ణబాబు.. ఫలితాలు వెలువడిన తర్వాత విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఆ సమయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.


ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై స్పందించిన వైసీపీ నేతలు టీడీపీ ఎమ్మెల్యేపై విశాఖలోని ఎంవీపీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు ఐపీసీ 294 (బి), 188 సెక్షన్ల కింద క్రైమ్‌ నంబర్‌ 158/19తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రామకృష్ణబాబుకు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని ఆ నోటీసులో పేర్కొన్నారు.


 వాస్తవానికి ఈ వ్యవహారం వెనుక ఏపీ ప్రభుత్వ వైఖరి స్పష్టమవుతుందనే టాక్ వినిపిస్తోంది. ప్రభుత్వ పాలనకు విఘాతం కలిగించే వారిని కట్టడి చేయడానికే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మరోవైపు, వెలగపూడి రామకృష్ణబాబుకు నోటీసులు ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ నేతలంతా అలెర్ట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు, ఆ పార్టీలోని కొందరు నేతలు సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.


మరింత సమాచారం తెలుసుకోండి: