జగన్మోహన్ రెడ్డి తాజా నిర్ణయంతో చంద్రబాబునాయుడుకు పెద్ద షాక్ తగలనుంది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం అంటే ఏమిటో 40 ఇయర్స్ ఇండస్ట్రీ జగన్ చూసి నేర్చుకోవాల్సిందే. 2014 ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదు. అందుకనే జనాలకు చంద్రబాబుపై మండిపోయింది. దాని ఫలితంగానే మొన్నటి ఎన్నికల్లో టిడిపి గూబ గుయ్యిమనిపించారు.

 

ఇక జగన్ విషయాన్ని చూస్తే  మొన్నటి ఎన్నికల్లో అనేక హామీలిచ్చారు. అలాగే పాదయాత్రలో కూడా చాలా హామీలనే ఇచ్చారు. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో తన హామీల్లో ఒక్కోదాన్ని అమలు చేయటం మొదలుపెట్టారు. ముందుగా వృద్ధాప్య పించన్లు పెంచారు. కిడ్న బాధితుల డయాలసిస్ కు రూ 10 వేలకు పెంచారు.

 

వైఎస్సార్ ఆరోగ్య శ్రీని పునరుద్ధరించారు. అక్టోబర్ 15 నుండి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించబోతున్నారు. ధరల స్ధిరీకరణ నిధిక్రింద రూ 3 వేల కోట్లు కేటాయించారు. ఆశావర్కర్ల జీతాలు పెంచారు. ఇలా..ఒక్కో నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. తాజాగా ఎస్సీ, ఎస్టి, బిసి, మైనారిటి, కాపులకు తన మంత్రివర్గంలో 50 శాతం పదవులు కేటాయించారు. ఐదుగురు డిప్యుటి సిఎంలను తీసుకోబోతున్నట్లు చెప్పిన జగన్ ఆ పదవులను కూడా పై వర్గాలకే కేటాయించారు.

 

 ఇలా ఇచ్చిన హామీల్లో ఒక్కోదాన్ని అమలు చేస్తుండటంతో చంద్రబాబుకు సమస్యలు తప్పేట్లు లేదు. ఎందుకంటే, ఇచ్చిన హామీలను తుంగలో తొక్కటం ఎలాగ అని చంద్రబాబు ఆలోచించారు. జగన్ మాత్రం హామీలను నెరవేర్చటం కోసం కష్టపడతున్నారు. ప్రస్తుతానికి జగన్ తీసుకున్న నిర్ణయాలతో పై సామాజికవర్గాలు రానున్న ఎన్నికల్లో వైసిపికి పూర్తిగా మద్దతుగా నిలబడే అవకాశాలున్నాయి.

 

జగన్ నెరవేర్చిన  ప్రస్తుత హామీలనే తీసుకున్నా రానున్న స్ధానిక సంస్ధల ఎన్నికల్లో మొత్తం పదవులన్నీ వైసిపినే గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ లెక్కన టిడిపి తరపున పోటీ చేసేందుకు అసలు నేతలు దొరుకుతారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. హామీలు నెరవేర్చేవారికి, ఎగొట్టే వారికి తేడాను జనాలు గమనించారు కాబట్టే మొన్నటి ఎన్నికల్లో వైసిపికి అఖండ మెజారిటిని అందించారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: