మంత్రి వర్గ ఏర్పాటు విషయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురుకి డిప్యూటీ సీఎంలుగా అవకాశం కల్పించారు. ఆ ఐదుగురు ఎవరనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. డిప్యూటీ సీఎంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేరు ప్రధానంగా వినిపిస్తోంది. 


25 మంది మంత్రులతో పూర్తిస్థాయి కేబినెట్‌ ఏర్పాటు చేయనున్నట్లు జగన్ ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు డిప్యూటీ సీఎం పదవులు కేటాయించనున్నట్లు సీఎం పేర్కొన్నారు. కేబినెట్‌లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉంటారని జగన్ స్పష్టం చేశారు.
 
అయితే.. ఈ సందర్భంగా జగన్ మరో కీలక విషయాన్ని వెల్లడించారు. రెండున్నరేళ్ల తర్వాత 90శాతం మంత్రులను మారుస్తామని జగన్‌ సంచలన ప్రకటన చేశారు. ఇప్పుడు మంత్రి పదవి ఆశించి భంగపడ్డ వారికి అప్పుడు కేటాయిస్తామని జగన్ చెప్పకనే చెప్పేశారు. కొత్తవారికి అప్పుడు అవకాశం ఇస్తామని కూడా ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: