ఉత్తరాంధ్రలో సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న బొత్స కాంగ్రెస్ ద్వారా ఎన్నో పదవులు సంపాదించుకున్నారు. పీసీసీ ప్రెసిడెంట్ గా కూడా పనిచేశారు. చివర్లో సీఎం రేసులో కూడా ఉన్నా ఫలితం లేకపోవడంతో కాంగ్రెస్ కి గుడ్ బై కొట్టేశారు.


దాదాపుగా అయిదారేళ్ళుగా బొత్స చేస్తున్న రాజకీయ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. ఆయనకు మళ్ళీ అమాత్య యోగం దక్కింది. నాడు వైఎస్సార్ క్యాబినెట్లో కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహించిన బొత్స ఇపుడు ఆయన తనయుడు జగన్ క్యాబినెట్లో చేరారు. బొత్స సీనియారిటీ, ఉత్తరాంధ్రలో ఆయనకు ఉన్న రాజకీయ  అనుభవం ద్రుష్ట్యా కీలకమైన శాఖలు ఇస్తారని అంటున్నారు.


బొత్స విజయనగరం జిల్లాలో మొత్తం సీట్లు వైసీపీ ఖాతాలో పడేలా చేశారు. తన రాజకీయ చతురతను చూపించి మరీ ఫ్యాన్ గాలి గిర్రున తిరిగేలా చేశారు. బొత్స  సేవలను జగన్ గుర్తించి ఆయనకు మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఇక జగన్ క్యాబినెట్లో నోరున్న మంత్రిగా బొత్స ఇకపై తన హవా చాటొచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: