చిరకాలంగా తనను నమ్ముకున్న వారికీ జగన్ అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. వీరిలో మోపీ దేవి వెంకటరమణ రేపల్లె నుంచి పోటీ చేసి ఓడిపోయిన తనకు జగన్ మంత్రి పదవిని కేటాయించారు. అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ మండపేట నుంచి పోటీ చేసి ఓడిపోయారు. తనకు కూడా మంత్రి పదవి ఇచ్చారు. వీరిద్దరూ జగన్ కు మొదటి నుంచి వెన్నంటే ఉన్నారు. ఇలా జగన్ తనను నమ్ముకున్న వారికి న్యాయం చేస్తానని చెప్పకనే చెప్పారు. 


అయితే కొంతమందికి మంత్రి పదవులు వస్తాయని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు. ముఖ్యంగా వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ రోజా - చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు... సీనియర్ లీడర్ ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మరో కీలక నేత - జగన్ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడైన భూమన కరుణాకర రెడ్డికి సైతం చోటు దక్కలేదు.దాదాపుగా ప్రతి జిల్లాలో ఇలాంటి నేతలు కనిపిస్తున్నారు.


శ్రీకాకుళం జిల్లాలో సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు పేరు కూడా జాబితాలో కనిపించలేదు. ఆయన సోదరుడు ధర్మాన కృష్ణదాస్ కు మంత్రి పదవి దక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ధర్మాన ప్రసాదరావు అనుచరులు ఏంటీ పరిస్థితి అని టెన్షన్ పడుతున్నారు.అలాగే గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేశ్ పై గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి కూడా మంత్రి పదవి దక్కలేదు. అదే జిల్లాలో మర్రి రాజశేఖర్ కు గతంలో జగన్ నుంచి హామీ దొరికినా ఇప్పుడు చాన్సు దొరకలేదు. కొన్ని సామాజిక లెక్కల వల్ల అవకాశం దక్కలేదని తెలుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: