సీ ఎం గా జగన్మోహన్ రెడ్డి ప్రమాణం చేసాక తనదైన మార్కు పాలన మొదలుపెట్టాడు. ఒక్కో వ్యవస్థపై సమీక్షలు నిర్వహిస్తూ పాలనాపరమైన మార్పులు తీసుకురాబోతున్నాడు. ప్రజల ప్రయోజనాల కోసం కొత్త రేషన్ కార్డులను ప్రవేశపెట్టబోతున్నాడు. పదవి స్వీకరించిన అతి తక్కువ సమయంలోనే తన పథకాలతో ఆలోచనలతో విప్లవాత్మకమైన మార్పులు తీసుకుబోతున్నాడు.

నిజానికి నాలుగేళ్ళ క్రిందటే ఈ ప్రక్రియ మొదలుకావాల్సి ఉన్నా గత ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కొత్త రేషన్ కార్డుల జారీ మొదలు కాలేదు. ఇప్పుడు సీ ఎం ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపించడంతో అధికారులు ఈ పనిని మొదలుపెట్టబోతున్నారు. పాత రేషన్ కార్డుల స్థానంలో డిజిటల్ కార్డులు రాబోతున్నాయి.

అంతేకాక రేషన్ దుకాణాల్లో అవకతవకలు జరగకుండా ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నరట అధికారులు . బియ్యాన్ని ప్యాక్ చేసిన బ్యాగ్స్ రూపంలో అందించడానికి అధికారులు ప్రయత్నాలు మొదలుపెట్టారట. సీ ఎం ఐన అతి తక్కువ రోజుల్లోనే ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం పట్ల ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: