వైయస్సార్ రైతు భరోసా పథకం అక్టోబర్ 15 నుండి అమలు కాబోతుంది. ఈ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లోని రైతులు ఒక్కొక్కరు 12,500 రుపాయలు లభ్ది పొందబోతున్నారు. అంతే కాక రైతు భరోసా పథకం క్రింద మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయబోతున్నారు. ధరల స్థిరీకరణ నిధి వలన మార్కెట్లో రైతు పండించిన పంటలకు తగిన విలువ వచ్చే అవకాశం ఉంది.

 

ఇదే సమయంలో ఈ పథకంతో సంబధం లేకుండా కేంద్రం నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడి రైతుల సంక్షేమం కోసం పీఎం కిసాన్ యోజన పేరుతో రెండు వేల రుపాయల చొప్పున సంవత్సరానికి మూడు సార్లు రైతులకు ఆరు వేల రుపాయలు అందించబోతున్నాడు. పీ ఎం కిసాన్ యోజనలో ఈ మధ్యనే కొన్ని మార్పులు కూడా చేసారు.


ఇంతకుముందు ఈ పథకానికి అర్హత పొందాలంటే రెండు హెక్టార్ల లోపు పొలం ఉన్న రైతులు మాత్రమే అర్హులుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ నిభంధన తొలగించటంతో రైతులందరికీ ఈ పథకం వర్తింపజేయనున్నారు. ఈ రెందు పథకాల వల్ల రైతులు 18,500 రుపాయలు పొందుతారు


మరింత సమాచారం తెలుసుకోండి: