జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ పార్టీ ఓటమి తరువాత .. ఓటమికి గల కారణాలను సమీక్షించుకున్నారు.  ఎందుకు పార్టీ ఓటమి పాలవ్వాల్సి వచ్చింది.  ఎక్కడ ఎలాంటి తప్పులు జరిగాయి అనే విషయాలపై చర్చలు జరిపారు.  అనంతరం చేయవల్సిన కార్యాచరణ ఏంటి అనే దానిపై త్వరలోనే ఓ నిర్ణయానికి వస్తారట.  


పవన్ పార్టీ ఓటమి తరువాత అతని లుక్ లో బాడీలో చాలా మార్పులు వచ్చాయి.  గడ్డం విపరీతంగా పెరిగిపోయింది.  దాన్ని తీసెయ్యడం లేదు.  ముఖం వాడిపోయినట్టు కనిపిస్తోంది.  పొట్ట కాస్త పెరిగింది.  మొత్తానికి పవన్ గ్లామర్ బాగా దెబ్బతింది.  


పార్టీకి పవనే గ్లామర్.  పవన్  గ్లామర్ గా కనిపిస్తేనే పార్టీ కళగా ఉంటుంది.  అలా కాకుండా ఇలా డీలా పడితే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది.  పవన్ జనాల్లోకి వెళ్ళింది ఈమధ్యనే కాబట్టి జనాలకు పవన్ అర్ధం కావడానికి సమయంపడుతుంది.  అంతమాత్రం చేత.. ఇలా డీలా పడిపోతే ఎలా.. 


పార్టీకి చెందిన మిగతా నాయకులు ఏమై పోతారు.  ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ తన గ్లామర్ పై కాస్త  దృష్టిపెట్టి.. తిరిగి యధాస్థితికి వస్తే బాగుంటుంది.  అది పార్టీకి చాలా మంచిది.  రాజకీయాల్లో ఉన్నంత మాత్రానా గ్లామర్ గా కనిపించాలని లేదు అని ఎక్కడ లేదు.  సో, పవన్ కాస్త ఆలోచిస్తే మంచిది.  


మరింత సమాచారం తెలుసుకోండి: