జగన్‌ ప్రతి అడుగు ఒక వైవిధ్యం !!
 ఎన్నికలు ముగిసిన తరువాత , అందరూ మర్చి పోయేది ఎన్నికల మేని ఫెస్టో,,,,
ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చేసిన వాగ్గానాలు మర్చి పోయి, గెలిచిన పార్టీ తమ పార్టీ ఖర్చులకు విరాళాలు ఇచ్చిన వారికి , ఏ విధంగా లబ్ది చేద్దామా అని అలోచించడం తప్ప , ప్రజలను పట్టించుకోని కాలమిది.

 అయిదేళ్ల క్రితం నరేంద్రమోడీ తిరుపతి బహిరంగ సభలో తిరుమల సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసి , తరువాత ఆ హామీని పట్టించుకోని అన్యాయం తెలుగు ప్రజలు చూశారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు డ్డాక్రా రుణాలు మాఫీ లాంటి వాగ్దానాలు చేసి , వాటిని మర్చి పోయిన చంద్రబాబు ప్రభుత్వాన్ని చూశారు. చివరికి టీడీపీ మేనిఫెస్టోని ఇంటర్నెట్‌ నుంచి మాయం చేయం చేయడం కూడా ఓటర్లు గమనించి , చివరికి ఆ పార్టీని ఎన్నికల్లో మాయం చేశారు...

ఇదంతా నిన్నటి చరిత్ర. 
ఇపుడు నవ్యాంధ్ర ప్రదేశ్‌కి యువ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ వచ్చారు. తనను గెలిపించిన ప్రజల రుణం తీర్చుకోవడమే తమ ముందున్న ఎజెండాగా జగన్‌ భావించారు. తన ఎన్నికల మేనిఫెస్టోలోని ''నవరత్నాలు'' అమలు బాధ్యతను నిత్యం సమీక్షల్లో అధికారులకు గుర్తు చేస్తున్నారు. ఎమ్మెల్యేల నుండి మంత్రుల వరకు నవరత్నాలు గుర్తుంచుకొని వాటి అమలుకు కృషి చేయాల్సిన బాధ్యతను గుర్తుండేలా.... సెక్రటేరియట్‌లోని సీఎం పేషీ హాలులో గోడ మీద ఫొటోలతో సహా ఫ్రేమ్‌ చేయించారు. 

ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రంలోను ఏ రాజకీయ పార్టీ మేనిఫెస్టో కి ఇంతలా ప్రాధాన్యత ఇచ్చిన దృశ్యాన్ని చూడ లేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
 '' వైఎస్సార్‌ సీపీ మేనిఫెస్టోలో ప్రధానమైన నవరత్నాలను సీఎంఓ గోడెక్కించిన జగన్‌. వాటిని నెరవేరిస్తే చాలబ్బా.... జీవితాంతం అతడు ముఖ్యమంత్రిగానే ఉంటాడు...'' అని ఒక ఫేస్‌బుక్‌ వాల్‌ మీద ఒక అభిమాని రాశాడు.
ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రస్తావించిన నవరత్నాలకు సంబంధించిన వాల్‌ పెయింట్స్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ సచివాలయంలో పెట్టించారు. 1.ఆరోగ్యశ్రీ 2. వైఎస్సార్‌ రైతు భరోసా 3. అమ్మ ఒడి 4. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ 5. వైఎస్సార్‌ ఆసరా ఫించన్లు 6. డ్వాక్రా రుణాలు 7. పక్కాఇళ్లు 8. మద్య నిషేధం 9. జలయజ్ఞం వంటి వాల్‌పెయింట్స్‌ను వరుసగా ఏర్పాటు చేయించారు. ఈ విషయాన్ని మంత్రి కొడాలి నాని తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ‘మ్యానిఫెస్టోను తూచ తప్పకుండ అమలు చేస్తానని చెప్తూ ఇలా సచివాలయంలో గోడల మీద వేయించిన ఏకైక సీఎం వైయస్ జగన్’ అని కొనియాడారు.


మరింత సమాచారం తెలుసుకోండి: