అంతులేని ప్రజాభిమానంతో జగన్‌ ఏపీ ముఖ్యమంత్రి అయ్యారు...ఓకే.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి క్షణం తీరిక లేకుండా అధికారులతో సమీక్షలు చేస్తున్నారు.
ఆహ్వానించ దగిన పరిణామం.

 మంత్రి వర్గం కూడా సమతూకంతో ఏర్పాటు చేసుకున్నాడు హ్యాపీ... కానీ, కొందరికి కొన్ని సందేహాలున్నాయి.

ఇంత తీరిక లేకుండా పరిపాలనలో బిజీగా ఉన్న జగన్‌ ప్రతి శుక్రవారం నాంపల్లిలోని సిబిఐ కోర్టుకు హాజరు అవ్వాలి కదా...? ఎలా ?

 ఇదే అనుమానంతో మొన్న శుక్రవారం జగన్‌ వస్తారేమో నని సిబిఐ కోర్టు దగ్గర మీడియా కెమారాలు ఎదురు చూశాయి.
కానీ జగన్‌ హాజరు కాలేదు. ఏం జరిగిందంటే..?
 ఏపీ ముఖ్య మంత్రిగా పరిపాలనా బాధ్యతలు,తీరిక లేని సమావేశాల వల్ల హాజరు మినహాయింపు కోరుతున్నట్టు , సీబీఐ కోర్టుకు శుక్రవారం జగన్‌ నివేదించారు.

ఆయన తరపున న్యాయవాది కోర్టులో పిటీషన్‌ దాకలు చేశారు.
దీనిని పరిశీలించిన సిబిఐ న్యాయస్ధానం జగన్‌ హాజరు మినహాయింపుకు అనుమతించారు. ఆ విధంగా జగన్‌ కోర్టుకు రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: