**ఆంధ్రప్రదేశ్ లో దేవాదాయ శాఖా ఆస్తులు అన్యాక్రంతం..!

 

 *కృష్ణా,గుంటూరు,తూర్పుగోదావరి జిల్లాలో విలువైన  ఆస్తులు.!

 

 *కృష్ణా జిల్లా, బాపులపాడు, కనుమోలు గ్రామంలో ట్రస్ట్ కు దానంగా ఇచ్చిన భూములను సైతం విక్రయించారు..

 

 *గుడివాడ రామచంద్రాపురంలో ఒక గురుపీఠం..

 

 *మంగళగిరి – గుంటూరు హైవై పై మంగళగిరి రోడ్డు (సౌత్),లో  ఒక గురుపీఠం..

 

 *తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం లో ఒక గురుపీఠం..

 

 *తామరాడ గ్రామం లో మరొక గురుపీఠం..

 

 *విజయవాడ గురుపీఠన్ని నకిలీ పత్రాలతో దర్జాగా అనుభవం..

 

 *విజయవాడ గురుపీఠం పై హైకోర్టు కు వెళ్ళిన ఫలితం లేని వైనం..

 

 *రూ.12  కోట్ల విలువైన స్థలం స్వాహా..

 

 *జిల్లాకు చెందిన టిడిపి మాజీ  మంత్రి, దేవాదాయశాఖ ముఖ్య అధికారి  హస్తం ఉన్నట్లు ఆరోపణలు.. !?

 

 *క్రింది స్తాయి అధికారుల అండదండలలు పుష్కలంగా ఉన్నాయని ఆరోపణలు !?

 

విశాల హృదయంతో దేవాలయాలు, సత్రాలకు,గురుపీఠలకు ఇచ్చిన భూములు అన్యాక్రాంతం కావడంతో దాతల ఆశయం నీరు గారుతుంది. 

ఆలయ భూములు, ఆస్తులను కంటికి రెప్పలా కాపాడాల్సిన దేవాదాయశాఖ  అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో దేవుడు ఆస్తులు కాస్త హారతి కర్పూరంలా కరిగిపోవడం కృష్ణ జిల్లా విజయవాడ 1 టౌన్ లో పరిపాటిగా మారిపోయింది.

 

 **వివరాలోకి వెళ్తే ...!!

 

విజయవాడ, చిట్టినగర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు దుర్గాసి అగ్గిరాములు  సోదరుడు దుర్గాసి వెంకయ్య @ వెంకన్న  సుమారు 90 సంవత్సరాలకు  పూర్వం బెజావాడ లో ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారు ఆలయానికి   వేరే ప్రాంతం లో ఉన్న యాత్రికుల సౌకర్యార్థం అమ్మ దర్శనం కోసం వచ్చు భక్తులకు , మరియు సదువులు, సన్యాసులు కోసం ఒక సత్రాన్ని స్తాపించారు,

 

 వాటితో పాటు ఒక  శివలింగాన్ని కూడా ప్రతిష్టించి నిత్యo  పూజలు చేసేవారు.

 

వీరి గురువు గారు అయిన శ్రీ మన్మడుపు సుబ్బయ్య చార్యులు గారి విగ్రహాన్ని ప్రతిష్టించి ఉన్నారు.

 

 *శ్రీ  మన్మడుపు సుబ్బయ్య చార్యులు వారి ప్రధమ గురు పీఠం   మంగళగిరి – గుంటూరు హైవై పై మంగళగిరి రోడ్డు (సౌత్),లో పరమయ్య గుంట, శ్రీ శ్రీనివాస శిల్పకళ మందిరంకు ఎదురుగా ఒక గురుపీఠం ఉంది.

 

 *దుర్గాసి వెంకయ్య శిష్యులు కృష్ణాజిల్లా, గుడివాడలో  రామచంద్రాపురం గ్రామం, మండెం రోడ్డు లో రుషికేశ్వరా ఆశ్రమం పేరుతొ ఒక గురుపీఠన్నిస్తాపించుకున్నారు* ..

 

 *తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం లో దుర్గాసి వెంకయ్య గారి శిష్యులు బెవర మాణిక్యయ్యరులు ఒక గురుపీఠన్ని స్తాపించుకున్నారు ..

 

 *తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా తామరాడ గ్రామం లో దుర్గాసి వెంకయ్య గారి శిష్యులు కోసరం వీరన్నయ్యరులు ఒక గురుపీఠం స్తాపించుకున్నారు.

 

 *అందరు శ్రీ మన్మడుపు సుబ్బయ్య చార్యులు స్వాముల వారి  అచల గురు పీఠం గా పిలుస్తారు.

 

మొత్తం కోట్లాది రూపాయిలు భూములు,సదరు పీఠలకు  కొన్ని స్తలాలు ఉన్నాయి. వాటి విలువ కోట్లాది రూపాయలు ఉంటాయి.

 

వీటిపై కొంతమంది కన్ను పడింది విలువైన ఆస్తులు కొన్ని అమ్ముకోవడం జరిగిపోయాయి,

 

వారికీ ఇంటి దొంగలు సహాయ సహకారం పూర్తిన ఉన్నాయి. 

 

 *• గుంటూరులో ఉన్న శ్రీ  మన్మడుపు సుబ్బయ్య చార్యులు వారి ప్రధమ గురు పీఠం లో ఆస్తులు కోట్లాది రూపాయిలు ఉన్నట్లుగా సమాచారం.

 

 *• తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో దుర్గాసి వెంకయ్య గారి శిష్యులు బెవర మాణిక్యయ్యరులు మరియు దుర్గాసి వెంకన్న ఇద్దరు కలిపి స్తాపించిన గురుపీఠo ఇది , యిప్పుడు ఈక్కడ గురుపీఠం లేదు, గురుపీఠన్ని తొలగించి బెవర మాణిక్యయ్యరులు వారి వారసులు ఆదాయం వనరులుగా మార్చుకున్నారు, అక్కడు ఉన్నా కొంతమంది శిష్యులు కాకినాడలో ఉన్నా శ్రీ పీఠం కు వెళ్తున్నట్లుగా చెప్పారు.

 

 *• దుర్గాసి వెంకయ్య శిష్యులు కొంత మంది మరియు కొల్లి గురు ప్రసాద్ గార్లు కృష్ణాజిల్లా, గుడివాడలో  రామచంద్రాపురం గ్రామం, మండెం రోడ్డు లో రుషికేశ్వరా ఆశ్రమం పేరుతొ ఒక గురుపీఠన్నిస్తాపించుకున్నారు.

 

ఈ గురుపీఠం లో కొన్ని కోట్లు రూపాయిలు ఆస్తులు ఉన్నట్లుగా సమాచారం.

 

 *• తూర్పుగోదావరి జిల్లాలో పెద్దాపురం నుండి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నా తామరాడ గ్రామం లో దుర్గాసి వెంకయ్య గారి శిష్యులు కోసరం వీరన్నయ్యరులు గురుపీఠం ,మరియు చుట్టుపక్కల చాల విలువయిన ఆస్తులు ఉన్నట్లుగా సమాచారం.

 

 *• ఇప్పుడు విజయవాడ గురుపీఠం విషయానికి వస్తే..

విజయవాడ పట్టణంలోని విద్యాధరపురం,చిట్టినగర్, రీ సర్వే నెం. 40/1A1 లో ప్రస్తుతం  రూ.12 కోట్లు రూపాయిలు విలువ చేసే సత్రం స్థలం ఉంది.

 

 సదరు  సత్రం నిర్వాహణ కొరకు వెంకన్నగారి శిష్యబృందం కొంతమంది విజయవాడ విధ్యధరాపురం సర్వే నెంబర్ 40/1A1 లో   600 చదరపు గజాల స్థలాన్ని దానంగా ఇచ్చారు. 

 

కాలక్రమేనా సదరు సత్రాన్ని పెద్దది చేయాలి విశాలంగా ఉండాలన్న ఉద్దేశంతో  దుర్గాసి వెంకయ్య 1945వ సంవత్సరంలో శొంటి గిరిరాజు వద్ద నుంచి 450 చదరపు గజములు కొనుగోలు చేసి ఉన్నారు.(రిజిస్టర్ దస్తావేజు).

 

దుర్గాసి వెంకయ్య @వెంకన్న నాటు వైద్యం చేస్తూ  అక్కడే  నివాస ఉండేవారు, వెంకన్నకు వివాహం కాలేదు, బ్రమ్మచారి కావడంతో  ఒకపక్క గృహం, మరోపక్క సత్రాన్ని ఏర్పాటు చేసి ఇంద్రకీలాద్రి పై వెలిసిన కనకదుర్గ అమ్మవారి దర్శిన కోసం ఇతర ప్రాంతాలనుంచి వచ్చు భక్తులకు మరియు సదువులకు  ఆశ్రయం కల్పించేవారు.

 

 సత్రాన్ని తన మేనకోడలు అయిన దుర్గాసి సూరమ్మకు మరియు వీరి సోదరులకు భాద్యతలు అప్పజేపారు.

 

 *క్రమేపి వెంకన్న మృతి చెందేరు.

 

 దుర్గాసి సూరమ్మను,మరియు వారి వారసులను దుర్గాసి వెంకయ్య శిష్యబృందం వారు సత్రం  బాగోగులలో మేము కూడా పాలుపంచుకుంటాము అని నమ్మించరు, మీరు,మీ కుటంబ సభ్యులతో ఒక కమిటి వేస్తాం అందులో స్వర్వ అధికారాలు మీవే మేము సభ్యులు గా కొనసాగుతము అని నమ్మించారు, చదువు లేని సూరమ్మ మరియు వారి భర్త సూర్యనారాయణ వీరి వారసులు  ఒప్పుకున్నారు.

 

 దీంతో అప్పటి దేవాదాయ అధికారులు ఆస్థలాన్ని స్వాధీనపర్చుకోలేదు.

 

ఇదే అవకాశంగా తీసుకున్న కొంతమంది గురు భక్తులు స్వార్ద ప్రయోజనం కోసం సదరు వెంకన్నకి దత్తత కుమారుడు అంటూ గురువులు అనే వ్యక్తి  సదరు సత్రాని “శ్రీ మన్మడుపు సుబ్బయ్య చారుయ్యలు దేశి కేంద్రం స్వాముల వారి అచల గురుపీఠం ట్రస్ట్” కి సుమారు 1300 చ// గజలలో ఉన్న గురుపీఠన్నీ కేవలం 175 చ // గజలు దానం గా ఇచ్చారు అందులో  అతను కూడా ఒక నెంబర్ గా చూపించుకోన్నారు.

 ( ఇక్కడే అసలు కుతంత్రం బయటపడింది,1300 చ//గజలో ఉన్న గురుపీఠం కేవలం 175 చ// గజలు ఇవ్వడం ఏమిటి..? )

 

అసలు వారసులను పక్కన పెట్టారు, వారుకూడా చదువు లేనందున ఎటువంటి విషయాలు లేలియలేదు.

 

 1951 వ సంవత్సరంలో సదరు దుర్గాసి వెంకయ్య మృతి చెందారు అనట్లుగా  అప్పట్లోనే దుర్గాసి వెంకయ్య గారి దత్తత కుమారున్ని  అంటూ గురువులు అనే  వ్యక్తి సత్రం  బాధ్యత తీసుకుంటారని ఒక కథనం ప్రకారం సదరు సత్రాన్ని వారి ఆధీనంలోకి తీసుకున్నారు.

 

1945 సంవత్సరంలో  వెంకయ్య గారు సత్రం కోసమని శొంటి గిరిరాజు వద్ద  నుంచి 450 చదరపు గజాలు కొనుగోలు చేసిన స్థలాన్ని 1953వ సంవత్సరంలో  గురువులు అనే వ్యక్తి ఇతరులకు విక్రయించాడు.

 

సత్రం నిర్వహణకు కమిటీ ఏర్పాటు చేసి కొనసాగించారు.

 

 వెంకన్న  మరణించిన తర్వాత ఆ సత్రాన్ని మరియు సదరు స్థలాన్ని దేవాదాయ శాఖాధికారులు పట్టించుకోకపోవడంతో దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు ఆ స్థలాన్ని కబ్జా చేయాలని ప్రయత్నంతో అందరు అప్పటి అధికారులతో చేతులు కలిపి దర్జాగా సత్రాని స్వాధీనం చేసుకున్నారు..

 

90  ఏండ్ల నుండి ఉన్న ఈ సత్రం స్థలంపై అడిగేవారు లేకపోవడంతో దర్జాగా నిర్మాణాలు చేస్తున్నారు. 

 

గురుపీఠం విలువ సుమారు మార్కెట్ లో  రూ.12 కోట్లు వరకు  ఉంటుంది.  

 

మార్కెట్ లో  చ.గజం రూ. 1 లక్ష రూపాయల  నుంచి రూ.1.50 లక్ష రూపాయిలు  ధర పలుకుతున్న సుమారు 800 చ.గ. స్థలం అన్యాక్రాంతమైంది.

 

 *ఆ స్థలంలో పక్కా నిర్మాణాలు సైతం వెలిశాయి.*

 

 *అసలు కధ 2012 వ సం // లో మొదలైంది ...!!

 

సదురు దుర్గాసి వెంకన్న సత్రం స్తలని మర్కట్లోకి విక్రయానికి పెట్టినట్లుగా సమాచారం అందుకున్న దుర్గాసి సూరమ్మ కుమారుడు సూర్యప్రకాశరావు అసలు విషయాలు చూసి ఆచార్యనికి గురియ్యారు.

 

 దస్తావేజులు అన్ని పరిశిలిస్తే అసలు తమ వారసులు మైన మా పేర్లు ఎక్కడ లేకపోవడంతో మేము మా కుటంబ సభ్యులు మోసపోయామని దుర్గాసి వెంకయ్య సోదరులు వారసులు గ్రహించారు.

 

అత్తిలి దుర్గమ్మ అనే గురు భక్తురాలు శ్రీ మన్మడుపు  సుబ్బయ్య చార్యుల అచల గురు పీఠం ట్రస్ట్ వారికి 1951 వ సంవత్సరంలో కృష్ణ జిల్లా , బాపులపాడు మండలం,కనుమొలు గ్రామంలో సర్వేనెంబర్ 401 లో 47 సెంట్ల భూమిని దానంగా ఇచ్చారు, ఇచ్చిన భూమిని కూడా ఇప్పుడు ట్రస్ట్ పేరుమీద లేవు , వాటిని కూడా విక్రయించి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి..

 

 *2012వ సం//  నుండి దేవాదాయశాఖ కు ఎన్నిసార్లు పిర్యాదు చేసిన పట్టించుకోలేదు అని దుర్గాసి సూర్యప్రకాశరావు చెప్పుతున్నారు.

 

 *ప్రస్తుతం ఉన్న పరిస్థితి :

 

దేవుని ఆస్తులు  కాపాడడంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. 

 

నిబంధనల మేరకు ఆస్తులను అక్రమించుకోన్నావారిని  అడ్డుకట్ట వేయడంలో  అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు.

 

 *దేవాదాయ ధర్మదాయ శాఖా సెక్షన్ 30/87 ప్రకారం పీఠలు, సత్రాలు,ఆశ్రమలు అన్ని  దేవాదాయశాఖ అధీనంలో లేకపోయినా అవి దేవాదాయశాఖ ఆస్తులుగా పరిగణించాలి..!

 

 దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు విలువైన భూములను కాపాడుకోవడంలో మాత్రం అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 

 

దుర్గాసి వెంకన్న కు దత్తత తీసుకున్న తన తండ్రికి మేమే   వారసుడని, ఆ ఆస్తిని తాము అనుభవించేందుకు హక్కుదారులుగా  సదరు సత్రాన్నీ కొంతమంది ఆక్రమణదారులతో చేతులు కలిపి స్వాధీనం చేసుకున్నారు..

 

సత్రం స్థలానికి ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది, దాదాపు 12  కోట్ల విలువ చేసే ఆస్తి  కావడంతో గతంలో గురుపీఠo ఆస్తులు అమ్ముకున్న గురువులు  తనయుడు వెంకటేశ్వరరావు అతని సోదరులు సత్రం పై  కన్నేశారు.

 

 ప్రస్తుతం మఠం  పేరుతో ఉన్న 800 చదరపు గజాల స్థలాన్ని దురాక్రమణ చేసి ఆదాయ వనరులుగా  మార్చుకున్నారు.

 

 తప్పుడు పత్రాలతో వారికీ వారే సత్రం ఆస్తులను 20 సం // లు  లీజు అగ్రిమెంట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

 

 వీరి కబ్జాలకు రెవిన్యూ శాఖా, రిజిస్ట్రేషన్ శాఖా, దేవాదాయ శాఖ అధికారులు సహకారం  పూర్తిగా అందిస్తున్నారు.

 

 కొంత మేరకు 450 చదరపు గజాలు విక్రయానికి మార్కెట్లో బేరం పెట్టినట్టుగా సమాచారం దీని వెనక వీరి సమీప  బంధువు ఒక డాక్యుమెంట్లు రైటర్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం..

 

కోట్ల విలువైన స్థలం కబ్జా వెనుక  స్థానిక అధికార నాయకులతో పాటు గా ఒక జిల్లా  మంత్రి హస్తం కూడా ఉన్నట్లు సమాచారం.

 

ఎవరైనా సదరు సత్రంపై ప్రశ్నించినా, వారిపై కేసులు పెడితే  ఎలాంటి కేసులు లేకుండా చూసుకుంటున్నారు సదరు మంత్రి.. 

 

సదరు మంత్రి వర్యులు ఈ కబ్జారాయుళ్ళు నుంచి లక్షలాది రూపాయల ముడుపులు తీసుకున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

 

 స్థలం కబ్జాకు గురవుతుంది అని  వెంకన్నగారి సోదరుని వారసులు గతంలో అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు మాత్రం బుట్ట దాఖలు చేయలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి..

 

దుర్గాసి వెంకన్న సత్రానికి సంబంధించిన  విషయంలో అప్పట్లో ఉన్న వారెవరూ ఇప్పుడు జీవించి ఉండకపోవడంతో దీన్ని ఆసరాగా చేసుకొని కబ్జా చేశారని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. 

 

వెంకన్న సోదరులు వారసులు మాత్రం సత్రాన్ని దేవాదాయశాఖ స్వాధీనం చేసుకోవాలని 2012 సం // నుంచి పలుమార్లు పిర్యాదు చేసిన దేవాదాయశాఖ వారు స్పందించలేదని చెప్పుతున్నారు.. 

 

సదరు సత్రం లో  ఉన్న స్థలంలో చిన్నచిన్న దుకాణాలను ఏర్పాటు చేసుకుని వచ్చే ఆదాయంతో సత్రానికి ఉపయోగిoచకుండా వారి స్వలాభం కోసం అద్దులు  రూపంలో మార్చుకున్నారు..  

 

ఈ విషయంపై అధికారులకు ఎన్ని సార్లు  ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని కొంతమంది రాజకీయ నాయకులకు సంబంధo ఉన్నయని  వెంకన్న సోదరుల వారసులు ఆరోపిస్తున్నారు ..

 

 *చివరిగా దుర్గాసి సూరమ్మ కుమారుడు దుర్గాసి సూర్య ప్రకాశరావు  గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ వారికి  సదరు సత్రం పై పిర్యాదు చేశారు.

 

 *గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ వారు WP 32362 of 2018 ద్వార 10.9.2018  దేవాదాయశాఖ కు ఒక ఆర్డర్ ఇస్తూ నాలుగు నెలలో సదరు సత్రం పై చర్యలు తీసుకోవలసిన దిగా ఇచ్చారు, జనవరి 2019 కి నాలుగు నెలలు పూర్తి అయింది కానీ దేవాదాయశాఖ అధికారులకు మాత్రం చలనం లేదు.

 

 *దాతలు దేవుడికి సమర్పించిన కానుకలు స్థలాల రూపంలో,కొన్ని ఆస్తులు ఇస్తారు..

 

 *పూర్వం దాతలు దేవుడికి సమర్పించిన ఆస్తులనే రక్షించలేని దేవాదాయశాఖ అధికారులు కొత్తగా ఎవరైనా దాతలు విలువైన స్థలాలు ఇస్తే రక్షించగలరా..?

 

 *ఇది కూడా ఒక ప్రశ్ననే..?

మరింత సమాచారం తెలుసుకోండి: