తెలుగుదేశం పార్టీకి.. బీజేపీకి ఇప్పుడు పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమంటోంది. ఎన్నికలకు ముందు ఈ వ్యవహారం మరింత ముదిరిపోయింది.  2014 లో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలు ఇప్పుడు బద్ద శత్రువులయ్యాయి.  అయినా ఓ విషయంలో బీజేపీ తమ పాత మిత్రుడు టిడిపి కి సపోర్ట్ చేసింది.  


కొత్త ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం చేసిన సమయంలో తెలుగుదేసం ప్రభుత్వం విధ్యుత్ ఒప్పందాలను తప్పు పడుతూ.. పునపరిశీలన చేపడతామని అవసరమైన ఆ ఒప్పందాలను రద్దు చేసుకుంటామని చెప్పింది.  దీంతో జగన్ పై కేంద్ర సీరియస్ అయ్యింది. 
 
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పున:పరిశీలన చేయడం పారిశ్రామిక అభివృద్ధికి మంచిది కాదని హితవు పలికింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చేసుకున్న వివిధ ఒప్పందాలు పారదర్శకంగా జరిగాయని అలాంటి వాటిపై పున: పరిశీలన దేశ పారిశ్రామిక అభివృద్ధిని తీస్తుందని, ఒప్పందాల పున:పరిశీలన పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని, వారు పెట్టుబడులు పెట్టేందుకు భయపడేలా చేస్తుందని కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ సీఎస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. 


ముఖ్యమంత్రికి ఈ విషయాలను అర్ధమయ్యేలా చెప్పాలని లేఖలో కోరారు.  జగన్ అధికారంలోకి వచ్చాక దూకుడును పెంచిన సంగతి తెలిసిందే.  పారదర్శకమైన పాలన అందించే విషయంలో జగన్ ఇదే విధమైన దూకుడు ఉంటుందని పలుమార్లు పేర్కొన్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: