ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన నాటి నుండి జగన్ ప్రత్యేక హోదా పై పోరాటం చేస్తూనే ఉన్నాడు. మిగతా రాజకీయ నాయకులు అవసరాన్ని బట్టి మాటలు మార్చినా సీ ఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రత్యేక హోదానే లక్ష్యంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైసీపీకు 22 ఎంపీ స్థానాలను ఇచ్చింది.  

తెలంగాణం సీఎం కేసీయార్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపారు. రెండు రాష్ట్రాల ఎంపీలు మొత్తం 31 మంది ప్రత్యేక హోదాపై పారమెంట్లో వాళ్ళ గళం వినిపిస్తే ప్రత్యేక హోదా వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహపూర్వకంగానే మెదులుతున్నారు.  

అంతేకాక భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ తన ఉనికిని చాటుకోవాలంటుంది. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పార్టీకి పెద్దగా ప్రాముఖ్యత లేదు. కానీ ప్రత్యేకహోదా ఇస్తే మాత్రం బీజేపీ రాష్ట్రంలో పుంజుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయి. ఏది ఏమైనా జగన్ ఈ ఐదేళ్ళలో ప్రత్యేక హోదా సాధిస్తే మాత్రం విభజన వలన పొందిన నష్టాల నుండి కోలుకునే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: