తెలంగాణ రాష్ట్రంలో అటు పార్లమెంట్ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు ముగిసాయి. ఇక పొతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టి.ఆర్.ఎస్ లో చేరడం సి ఎల్ పి ని తెరాసలో విలీనం చేస్తూ స్పీకర్ కి లేఖను సమర్పించడం అంత అయిపోయింది.

ఇక రాష్ట్రంలో మంత్రి వర్గ విస్తరణకు ఏర్పాట్లు లోలోపల జరుగుతున్నాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి.ఉన్న మంత్రులలో ముగ్గురు లేదా నలుగురిని తొలగించి కొత్తగా చేరిన వారిలో సీనియర్లకు అవకాశం ఇస్తారన్న చర్చ కూడా వినిపిస్తుంది ఇక ఈ మంత్రివర్గ విస్తరణలో పార్లమెంటు ఎన్నికల్లో, స్థానిక ఎన్నికల్లో జిల్లా లో పార్టీ ఎదుగుదలకు పని చేసిన వారికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉంది.

అయితే ఈ మంత్రివర్గంలో హరీష్ రావుకు దాదాపు మంత్రి పదవి లభించక పోవచ్చు అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ప్రస్తుతం ఉన్న సమీకరణలో కొత్త వారి అవసరం పార్టీకి ఉంది ఎంపీ స్థానాలలో కొంత నిరాశ  కలిగింది కాంగ్రెస్ లో మంత్రులుగా పని చేసిన అనుభవం ఉన్న నాయకులు కూడా టీఆరెఎస్ వైపు ద్రుష్టి సాగిస్తున్నారు. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా ఇప్పటికే వెలమ సామాజికవర్గం నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఉండటం, రేపు కేటీఆర్ కు కూడా పెద్ద శాఖను నిర్వహించవచ్చు,హరీష్ రావు కు కూడా మంత్రి పదవి ఇస్తే వెలమ సామాజిక వర్గానినే పెద్ద పీఠం వేస్తున్నారని ప్రత్యర్ధులు విమర్శలు చేయవచ్చని హరీష్ రావు కు మంత్రి పదవి ఇవ్వక పోవచ్చు అనే ప్రచారం జరుగుతోంది.ఈ విషయం పట్ల అసంతృప్తిగా హరీష్ రావు కూడా ఉన్నారు అన్నది వాసవమే అయినా బయటికి వెల్లిపుచ్చడం లేదు. ఇక దీనిపట్ల మౌనంగా ఉన్న హరీష్ అభిమానులు మాత్రం పార్టీ తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: