పెద్ద స్టార్స్ సినిమా వచ్చింది అంటే యూత్ అంతా అక్కడే ఉండిపోతారు. మూడు నాలుగు రోజుల నుంచి అక్కడే ఉంటూ హంగామా చేస్తుంటారు.  అభిమాన హీరో కోసం అనేక త్యాగాలు చేస్తుంటారు.  దాని వలన ఏమొస్తుంది.. అంటే అనందం వస్తుంది.  పోనీ ఆ హీరో వలన ఏమైనా నేర్చుకున్నారా అంటే అది ఉండదు. 

ఇంట్లో పెద్ద పెద్ద ఫోటోలు పెట్టుకుంటారు.  మొబైల్ ఫోన్లలో వేలకొద్దీ అభిమానుల ఫోటోలు ఉంటాయి.  నిశ్వార్ధంగా ప్రజలకు సేవచేసే వ్యక్తుల గురించి తెలుసుకోవాలని ఎవరికీ ఉండదు.  అలాంటి వ్యక్తుల ఫోటోలను కనీసం చూడాలని కూడా అనుకోరు.  అలాంటి వ్యక్తులు వేసిన బాటలో నడవాలని అస్సలు అనుకోరు.  


రాజకీయాల్లో స్వార్ధం ఉంటుంది.  ఒక చిన్న వార్డు మెంబర్ గా గెలవాలంటే కోట్లు ఖర్చు చేయాలి.  అదే ఎమ్మెల్యే, ఎంపీ అంటే చెప్పాల్సిన అవసరం లేదు.  వందల కోట్లు ఖర్చు.  సైకిల్ పై తిరుగుతూ.. డబ్బులు వంటివి పంచకుండా ప్రచారం చేసి ఎంపీగా గెలుపొందిన వ్యక్తి ప్రతాప్ చంద్ర షడంగి.  ఒడిశాలోని బాలాపూర్ నియోజక వర్గం నుంచి ఆయన గెలుపొందారు.  


కేంద్రసహాయ మంత్రిగా పదవిని పొందారు. పూరి గుడిసె, సైకిల్ ఆయన ఆస్తి.  ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా తనకు వచ్చిన జీతాన్ని గిరిజన ప్రజల కోసం వినియోగించాడు.  ఎంపీగా గెలిచాడు.  మంత్రి అయ్యాడు.  అయినప్పటికీ అయన గిరిజన ప్రజల కోసం పనిచేస్తానని, తనకు వచ్చే జీతాన్ని పేదప్రజల కోసమే వినియోగిస్తానని అంటున్నాడు.  మంత్రిగా ప్రోటోకాల్ ఉన్నా.. అయన సైకిల్ మీదనే పార్లమెంట్ కు వెళ్తారా చూద్దాం. 


మరింత సమాచారం తెలుసుకోండి: