వైఎస్ జగన్ ఎవరు అవునన్నా కాదన్నా ఏపీకి సీఎం. ఆయన బంపర్ మెజారిటీతో గెలిచారు. కనీ వినీ ఎరుగని విజయాన్ని నమోదు చేశారు. గత పది రోజుల ఆయన పాలన తీరు, వేస్తున్న అడుగులు కూడా  మేధావులతో సహా  అందరి ప్రశంసలను అందుకుంటున్నాయి.


ఐతే జగన్ విషయంలో ఇంకా టీడీపీ, దాని అనుకూల మీడియా జీర్ణించుకోలేకపోతున్నాయి. జగన్ ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేడంటూ వార్తలు వండి వార్చిన మీడియాకు ఇది కంటగింపుగా ఉంది. జగన్ కొత్త ముద్ర కోసం పడుతున్న తాపత్రయం, ఏపీని అవినీతి రహిత రాష్ట్రంగా చేయాలనుకోవడం వంటివి ఎందుకో అనుకూల మీడియాకు అంతగా నచ్చడంలేదులా ఉంది. ఇది సహజమే. తాము మెచ్చిన పార్టీ ఓడిపోవడంతో ఎవరికైనా బాధగా ఉంది.


ఇక అనుకూల మీడియాది ఇందులో పెద్ద బాధ. పాత ప్రభుత్వంలో ఎన్నో విధాలుగా లబ్ది పొందిన వారికి ఇపుడు చేతులు కట్టేసినట్లుగా కూడా ఉంటుంది. ఇక జగన్ విషయంలో  అనుకూల మీడియాకు చెందిన ఓకాయన తన కొత్త పలుకులో రాస్తూ కేంద్రం దగ్గర జగన్ ఆటలు సాగవని, ఆయన ప్రత్యేక హోదా వంటివి సాధించలేరన్నట్లుగా రాసుకొచ్చారు.  అక్కడ మోడీ అతి బలవంతుడని, ఆయన్ని కనుక ఇబ్బంది పెట్టాలనుకుంటే జగన్ మీద అసలే కేసులు వున్నాయని గుర్తు చేయడం పచ్చ పరాకాష్టకు నిదర్శనం.


తమిళనాడులో శశికళ ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించిన  సదరు పచ్చ మీడియా అధిపతి జగన్ కనుక జోరు చేస్తే అదే రీతిలో కళ్ళెం వేయడానికి మోడీ వెనకాడరంటూ హెచ్చరికలతో కూడిన సందేశాన్ని వండివార్చారు. అంటే జగన్ మోడీకి సరెండర్ కావాలన్నది ఆయన ఆలొచనగా  ఉంది. మరి ప్రత్యేక హోదా విషయంలో మోడీని ఎదిరించి తేవడం జగన్ వల్ల కాదని కూడా చెప్పినట్లుంది.


రాజకీయపర‌మైన ప్రతికూలతలు, అనివార్యతలు  రాసినా పర్వాలేదు కానీ శుభమాని నిన్ననే కుర్చీ ఎక్కిన యువ నాయకుడుకి శశికళ కేసు చెప్పి భయపెట్టాలనుకొవడం పైశాచిక ఆనందమే  తప్ప మరోటి కాదని వైసీపీ నెతలు మండిపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: