బీజేపీలో ఉండగా తరచుగా వెంకయ్య నాయుడు విశాఖ వెళ్తుండేవాడు. అక్కడ ఆయనకు ఎంతో ఇష్టమైన ఆహరం ఒకటి ఉంది.  అదే మూరి మసాలా.  విశాఖ సాగర తీరంలో ఎక్కువుగా అమ్ముతుంటారు.  దీనికోసమే విశాఖ  వాసులు బీచ్ కు వస్తుంటారు.  


ఇందులో ఏమేం కలుపుతారోనని తెలుసుకోవాలన్న ఆశక్తి చాలామందిలో ఉంటుంది. తాజా మూరీలో టమోటా, అల్లం, బఠాణీ, బజ్జీ, కొత్తిమీర, నిమ్మకాయరసం, ఉప్పు, కారం ఇలా పలురకాల వస్తువులను కలిపి అమోఘంగా ఈ మిక్చర్‌ను తయారుచేస్తారు. సాగర తీరంలో చల్లని గాలుల మధ్య, ఎగిసిపడుతున్న కెరటాల మధ్య ఈ మిక్చర్ తింటే ఆ రుచే వేరు. 


అందుకే విశాఖ నగరవాసులతో పాటు పర్యాటకులు కూడా ఈ మూవీ మిక్చర్‌కు ఫిదా అవుతారు. ఇంటిదగ్గర ఇలాంటి  మూరి మిక్చర్ ను తయారు చేసుకున్నా... అక్కడ దొరికే రుచి కనిపించదు. దాన్ని తయారు చేయడంలో అందులో ఎంతెంత మిక్స్ చేయాలి అనే దాంట్లోను విషయం ఉంటుంది. 


వెంకయ్య నాయుడు ఉపరాష్ట్రపతి అయ్యాక కూడా విశాఖ పట్నం వచ్చినపుడు తప్పకుండా తీరంలో దొరికి మూరి మిక్చర్ ను తెప్పించుకొని తింటారట.  సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు విశాఖ తీరంలోని మూరి మిక్చర్ ఫేమస్ అయ్యింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: