వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి కేబినెట్ కూర్పుపై ఇప్పుడు తెలుగు రాజ‌కీయాల్లో పార్టీల‌కు అతీతంగా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురుస్తోంది. తొలి విడ‌త‌లోనే ఏకంగా 25 మందితో జ‌గ‌న్ కేబినెట్ కూర్పు చేశారు. వీరిలో బీసీలు, ఎస్సీల‌కు తిరుగులేని ప్ర‌యార్టీ ఇచ్చారు. ఇక ఇప్పుడు ఈ కేబినెట్‌లో కొన్ని విశేషాలు కూడా ఉన్నాయి. ఏకంగా రెండోసారి గెలిచిన వారిలో జ‌గ‌న్ 14 మందికి మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు.


ఇక కేబినెట్‌లో ముగ్గురు నానీలు, ముగ్గురు శ్రీనివాసులు ఉండ‌డం కాక‌తాళీయ‌మే. కేవలం ఈ రెండు పేర్లతోనే  ఏకంగా ఆరు మంది నేతలు ఉండటం గమనార్హం. ఈ ఆరుగురు మంత్రుల్లో ముగ్గురివి ముద్దు పేర్లు కాగా... మ‌రో ముగ్గురు మంత్రుల‌వి అస‌లు పేర్లు ఉన్నాయి. ఇక నానీ మంత్రుల విష‌యానికి వ‌స్తే పేర్ని నాని, కొడాలి నాని, ఆళ్ల నాని ఈ ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. 


కొడాలి నాని అసలు పేరు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు... ఏలూరు  ఆళ్ల నాని అసలు పేరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్... పేర్ని నాని అసలు పేరు  పేర్ని వెంకట్రామయ్య. ఇక బాలినేని శ్రీనివాస్ రెడ్డి, అవంతి శ్రీనివాస్, వెల్లంపల్లి శ్రీనివాస్.. వీరి ముగ్గురు పేర్లలోనూ ‘శ్రీనివాస్’ కామన్ గా ఉంది. వీరిలో బాలినేనిని ముద్దుగా వాసు అని కూడా పిలుస్తారు. ఆయ‌న గ‌తంలో కూడా మంత్రిగా ప‌నిచేశారు. 


మ‌రో విశేషం ఏంటంటే ఆళ్ల నాని పేరులో కూడా శ్రీనివాస్ ఉంది. ఆయ‌న పూర్తి పేరు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌. ఈ లెక్క‌న చూస్తే న‌లుగురు మంత్రుల పేర్ల‌లో శ్రీనివాస్ ఉండ‌డం విశేషం. ఇక ఈ అసెంబ్లీలో శ్రీనివాస్ పేరున్న ఎమ్మెల్యేలు మొత్తం 13 మంది ఉన్నారు. వీరిలో పూర్తి పేరుతో కాకుండా శ్రీనివాస్ అని పిలిస్తే ఎంత‌మంది ప‌లుకుతారో ? అని సోష‌ల్ మీడియాలో కొంద‌రు చ‌మ‌త్క‌రిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: