ఏపీ ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి ప‌రిపాల‌నలో కొత్త ముద్ర వేసుకుంటూ ముందుకు సాగుతున్న సంగ‌తి తెలిసిందే. మేనిఫెస్టోను ప‌విత్ర గ్రంథంలా భావిస్తాన‌ని ప్ర‌క‌టించిన ప‌వ‌న్ ఈ మేర‌కు త‌గు నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అదే స‌మ‌యంలో ప్ర‌భుత్వ ప‌రంగా కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. తాజాగా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ చేసిన వైఎస్ జ‌గ‌న్ ఈ మేర‌కు త‌న టీం25ని ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే, మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులతో జ‌గ‌న్ నిర్వ‌హించ‌బోయే కేబినెట్ భేటీ స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. 


కీల‌క హామీల‌ను త‌న ప‌రిపాల‌న‌లో అమ‌లు దిశ‌గా తీసుకుపోయేందుకు జ‌గ‌న్ తొలి కేబినెట్ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. తొలి కేబినెట్‌లో 8 అంశాలపై చర్చించేందుకు ప్రాథమికంగా నిర్ణయించారు. ఈనెల 10వ తేదీ ఉదయం 10.30 గంటలకు ఈ అత్యవసర భేటీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తొలి కేబినెట్‌లో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అన్ని శాఖలకు శనివారం సర్యులర్‌ జారీచేశారు. ముఖ్యమంత్రిగా వైయస్‌ జగన్‌ ప్రమాణస్వీకారం చేసిన రోజు నవర త్నాల్లోని పింఛన్ల పెంపు ఫైలుపై తొలి సంతకంపై  కేబి నెట్‌లో చర్చించి ఆమోదించనున్నారు. ఇప్పటికే ఆయన తన పాదయాత్ర సందర్భం గా రాష్ట్రంలోని పింఛన్లను రూ. 3 వేలకు పెంచుతూ పోతానని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేరుస్తూ పింఛన్లను ఈ నెల నుండి రూ. 2,250 చేస్తూ ఆయన తొలి ఫైలుపై తొలి సంతకం చేశారు.


అలాగే ఆశావర్కర్ల జీతాలను రూ. 3 వేల నుండి రూ. 10 వేలకు పెంచుతూ ముఖ్యమంత్రి ఇప్పటికే ప్రకటించారు. దీనిపై కూడా మంత్రివర్గంలో చర్చించి వేతన పెంపుకు ఆమోదం తె పనున్నారు. ఇదే క్రమంలో నష్టాల్లో ఉన్న ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తానని రెండేళ్ల క్రితమే తిరుపతి వేదికగా ప్రకటించారు. కార్మికుల కష్టాలను యాజమాన్యం పరిగణలోకి తీసు కోకుండా ఏకపక్ష నిర్ణయాలతో వ్యవహరిస్తున్న తీరును ఆయన తీవ్రంగా గర్హిం చారు. ఇప్పుడు తొలి కేబినెట్‌లో ఏపీఎస్‌ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం పై చర్చించనున్నారు. అవసరమైతే ఇందుకోసం ఒక కమిటీని నియమించి పలు రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఏ విధంగా ఆర్టీసీని నడుపుతున్నాయి, వాటి వల్ల కార్మికులకు, ప్రభుత్వాలకు ఒనగూరుతున్న లాభాలు, నష్టాలపై ఒక నివేదిక తయారుచేయించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆర్టీసీ స్థితిగతులపై కూడా సుదీర్ఘం గా చర్చించిన మీదట ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనంచేసే అంశంపై నిర్ణయాన్ని తీసుకోనున్నారు. అలాగే మునిసిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు, హోంగార్డుల వేత పెంపుపై ఒక నిర్ణయాన్ని తీసుకునేలా కేబినెట్‌లో చర్చించనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర భృతి పెంచాలంటూ ఎప్పటినుండో డిమాండ్‌ ఉంది. శనివారం తొలిసారిగా సచివాలయంలోకి ప్రవేశించిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని సచివాలయ ఉద్యోగులు స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. దానిమీదట ఆయన దీనిపై త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తానని హామీ ఇచ్చారు.


ఈ ఏడాది అక్టోబరు 15 నుండి అమలు చేయనున్న రైతు భరోసా పథకంపై చర్చించనున్నారు. వాస్తవంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నవరత్నాల్లో భాగంగా 2020 మే నెల నుండి రైతు భరోసా పథకం ద్వారా ప్రతి ఏటా మే నెలలో పెట్టుబడి కింద రైతులకు రూ. 12,500 ఇస్తానని హామీ ఇచ్చారు. అయితే, గత ప్రభుత్వం ఇప్పటికే అన్నదాత సుఖీభవ పేరుతో సన్న, చిన్న కారు రైతులకు రూ. 10 వేలను ఇస్తానని చెప్పి రెండు విడతలుగా కిస్తీలను రైతుల ఖాతా లో జమచేసింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కిసాన్‌ సమ్మాన్‌ పథకం ద్వారా రూ. 6 వేలు మూడు కిస్తీల్లో రైతుల ఖాతాల్లో జమచేయాలని తీసుకున్న నిర్ణయానికి కొన సాగింపుగా చంద్రబాబు ప్రభుత్వం కూడా రూ. 10 వేలను జమచేయాలని నిర్ణయించి ఆపనికి శ్రీకారంచుట్టింది. ఇప్పుడు ఆ పథకాన్ని రద్దుచేస్తూ కొత్తగా ఏర్పడిన జగన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలోనే రైతులకు ఆమేరకు ఆసరాగా నిలచేందుకు వచ్చే ఏడాది మే నెల నుండి ప్రారంభించాల్సిన రైతు భరోసా పథకాన్ని ఏడాది రబీ సీజన్‌ నుండే రైతులకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ హామీని నెరవేర్చేందుకు కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. స్థూలంగా జ‌గ‌న్ తొలి కేబినెట్ విప్ల‌వాత్మ‌కంగా ఉండ‌నుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: