ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కేబినెట్‌లో కీలకమైన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గాను, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన పాముల పుష్ప శ్రీ‌వాణి చిన్న వయసులోనే మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రికార్డు సొంతం చేసుకున్నారు. విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున వరుసగా రెండోసారి ఘన విజయం సాధించిన ఆమెకు ముందుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే జగన్ అనూహ్యంగా ఎస్టీ కోటాలో శ్రీవాణికి మంత్రి పదవి ఇవ్వడంతో పాటు ఆమెను ఏకంగా డిప్యూటీ సీఎం కూడా చేశారు. కేవలం 31 సంవత్సరాల వయస్సుకే ఉప ముఖ్యమంత్రిగా శ్రీవాణి తెలుగు రాజకీయాల్లో అరుదైన రికార్డు సాధించారు. 


ఇక పుష్ప శ్రీవాణి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం దొరమామిడి. ఆమె విద్యాభ్యాసం అంతా స్థానికంగానే జరిగింది. ఆమెకు కురుపాం రాజవంశీకులు అయిన శత్రుచర్ల కుటుంబానికి చెందిన శత్రుచర్ల రాజుతో వివాహం అయింది. దీంతో ఆమె విజయనగరం జిల్లా కోడలు అయ్యింది. శ్రీవాణి వివాహం విచిత్రంగా జరిగింది. పుష్ప శ్రీవాణి తల్లిదండ్రులకు మొత్తం నలుగురు సంతానం. ఆమె అక్కను విజయనగరం జిల్లా కురుపాంకు చెందిన వ్య‌క్తికి ఇచ్చి వివాహం చేశారు. అక్క‌ను చూసేందుకు అక్క‌డ‌కు వెళ్లిన పుష్ప శ్రీ‌వాణిని శ‌త్రుచ‌ర్ల కుటుంబీకులు చూశారు. 


ఉన్నత విద్యావంతురాలు కావడంతో ఆమె తన కుమారుడికి కరెక్ట్ గా మ్యాచ్ అవుతుందని భావించిన శత్రుచర్ల కుటుంబీకులు మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ అయినా కావాలని మరి శ్రీవాణిని తమ ఇంటి కోడలిగా చేసుకున్నారు.  అలా పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయిగూడెం ఆడపడుచు కాస్త విజయనగరం జిల్లా కురుపాం కోడలు అయ్యింది. పుష్ప శ్రీవాణి తండ్రి పోలవరం మండలంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వంట కుక్‌గా ఉద్యోగం చేసి ఇప్పుడు పదవి విరమణ పొందారు. ఆయన తన ముగ్గురు కుమార్తెలను విజయనగరమే ఇచ్చారు. ఇప్పుడు తమ కుమార్తె మంత్రితో పాటు ఏకంగా ఉపముఖ్యమంత్రి కావడంతో వాళ్ల కుటుంబ ఆనందానికి అవ‌ధులు లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: