రెండువ సారి దేశ ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మోదీ శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చారు.అక్కడ జరిగిన బహిరంగ సభలో ప్రేత్యక హోదా గురించి ప్రస్తావించ కుండా మిగితా విషయాలు గురించి తెలివిగా తప్పించుకున్నారు. ఆ సభలో ఆంధ్రా రాష్ట్రానికి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాజధాని లేని రాష్ట్రం గా ఏర్పడ్డ నవ్య ఆంధ్రా ప్రదేశ్ అభివృద్ధికి తమదైన సహాయం అందిస్తామని అలాగే తాము ఆంధ్రా మరియు తమిళనాడు రాష్ట్రల లో  బలపడతాం అని త్వరలో ఇక్కడ అధికారంలోకి వస్తాం అని ఆయన ప్రసింగించారు.బీజేపీ ఇప్పటికే ఆంధ్రా రాష్ట్రంలో బలపడే విధంగా అడుగులు వేయడం మొదలు పెట్టింది.

రాష్ట్రంలోని ప్రముఖ మాజీ నాయకులను తమ పార్టీలోకి చేర్చుకోవడానికి వారితో సంప్రదింపులు జరుపుతుంది.దానికి అనుగుణంగా మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు జనసేన కు రాజీనామా చేశారని వార్తలు వెలువడ్డాయి.అవి నిజమనే అనిపిస్తున్నాయి.రాజీనామా అనంతరం రావెల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మి నారాయణను కలిశారు.మోదీ టీమ్ దక్షిణ భారతంలో పాగా వేయడానికి భారీ ఎత్తున వ్యువహాలు పన్నుతున్నట్లు సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: