- సమ్మె నోటీసును వెనక్కు తీసుకున్న కార్మిక సంఘాలు
 
ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీని విలీనం చేసే ప్రక్రియకు అడుగులు పడటంతో కార్మికులు తమ సమ్మె ఆలోచనను విరమించుకున్నారు. ఆర్టీసీ కార్మికుల చిరకాల కోరికను తీర్చేలా విలీనానికి అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆపై కార్మికుల డిమాండ్లను పరిష్కరించేందుకు సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు వెల్లడించారు. ఈ నేపథ్యంలో సమ్మె నోటీసును ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ దామోదరరావు స్పష్టం చేశారు. 


ఈ నెల 10న వచ్చి కలవాలని సీఎం నుంచి సమాచారం అందిందని, ఆ సమావేశంలో కార్మికుల సమస్యలను వివరిస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న సమ్మె సన్నాహక సభలను కూడా రద్దు చేశామని అన్నారు. కాగా, గతంలో ఆర్టీసీ ఎండీగా, డీజీపీగా పనిచేసి, రిటైర్ అయిన సీనియర్‌ ఐపీఎస్‌ ఆంజనేయరెడ్డి నేతృత్వంలో ఆర్టీసీ విలీనానికి కమిటీని వేయనున్నట్టు తెలుస్తోంది. రెండు నెలల్లోగా కమిటీ నివేదిక ఇవ్వాల్సివుంటుంది. దీని ఆధారంగా ఆర్టీసీ విలీనానికి విధివిధానాలు తయారవుతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: