ఒక్క అవ‌కాశం.. ఒకే ఒక్క అవ‌కాశం.. ఇవ్వండి.. మీ గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంటా!- అని త‌న పాద‌యాత్ర‌లో వెల్ల డించిన జ‌గ‌న్‌.. అన్న మాట‌ను నిల‌బెడుతున్నారు. రాష్ట్ర రెండో ముఖ్య‌మంత్రిగా బాద్య‌త‌లు స్వీక‌రించి ఇంకా ప‌ది రోజు లు కూడా పూర్తికాక ముందుగానే ఆయ‌న వేస్తున్న అడుగులు తీసుకుంటున్న నిర్ణ‌యాలు అసాధార‌ణంగా క‌నిపిస్తున్నా యి. పాల‌న ప‌గ్గాలు చేప‌ట్టిన వెంట‌నే తీసుకుంటున్న నిర్ణ‌యాలు ప్ర‌జ‌ల‌ను సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురి చేస్తున్నాయి. వాస్త‌వానికి రాష్ట్రం లోటు బ‌డ్జెట్‌లో ఉంది. ప్ర‌తి ఒక్క విష‌యంలోనూ ఆచితూచి వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. 


మ‌రోప‌క్క‌, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్ర‌త్యేక హోదా, ప్రాజెక్టులు వంటివి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో చాలా జాగ్ర‌త్త‌గా అడుగులు వేయాల్సిన అవ‌స‌రం ఉంది. వీటిని తెలుసుకున్న జ‌గ‌న్ ఎక్క‌డ నొక్కాలో.. ఎక్క డ పైకెక్కాలో తెలుసుకుని వేస్తున్న అడుగులు శ‌భాష్ అని అనిపిస్తున్నాయి. సీఎంగా ప్ర‌మాణం చేసిన మ‌రుక్ష‌ణ‌మే ఎవ‌రూ ఊహించ‌ని విధంగా అవ్వాతాత‌ల పింఛ‌న్‌ను నెల‌కు రూ.250 కి పెంచే ఫైల్ పై సంత‌కం చేశారు. ఈ నిర్ణ‌యం త‌ను ప్ర‌క‌టించిన న‌వ‌రత్నాల జాబితాలో ఉండ‌డంతో రాష్ట్ర వ్యాప్తంగా జ‌గ‌న్ పేరు మ‌ర్మోగింది. 


ఇక‌, తాజాగా సీఎంగా స‌చివాలయంలోని త‌న గ‌దిలోకి ప్ర‌వేశించిన జ‌గ‌న్‌.. అనూహ్యంగా మూడు ఫైళ్ల‌పై సంత‌కం చేశా రు. ఈ మూడు కూడా అత్యంత కీల‌క‌మైనవి కావ‌డం గ‌మ‌నార్హం. ఒక‌టి ఆశా వ‌ర్క‌ర్ల‌కు రూ.10 వేల వేత‌నం అందించేం దుకు ఉద్దేశించిన పైలు. నిజానికి వీరి స‌మ‌స్య‌లు కొన్ని ఏళ్లుగా కొన‌సాగుతున్నాయి. అయితే, వీరిని ప‌ట్టించుకున్న ప్ర‌భుత్వాలు ఎక్క‌డా మ‌న‌కు క‌నిపించ‌లేదు. అయితే, జ‌గ‌న్ త‌న పాద‌యాత్ర‌లో ఇచ్చిన హామీ మేర‌కు ఆశాల‌కు నెల వేతనం భారీగా పెంచారు. ఇక‌, జ‌ర్న‌లిస్టుల బీమాను రూ.10 ల‌క్ష‌ల‌కు పెంచుతూ నిర్ణ‌యించారు. అదేవిధంగా అనం త‌పురం-వెల‌గ‌పూడి ఎక్స్‌ప్రెస్ వేకి ఏపీ నుంచి అన‌మ‌తి ఇస్తూ.. కేంద్రానికి పంపే ద‌స్త్రంపై సంత‌కాలు చేశారు. 


ఇలా జ‌గ‌న్ త‌న‌దైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా ఎస్సీ, ఎస్టీల‌కు త‌న మంత్రి వ‌ర్గంలో చోటు క‌ల్పించ‌డం, తాను సింపుల్‌గా ఉంటూ.. ప్ర‌భుత్వ ఖ‌ర్చును త‌గ్గించ‌డం వంటివి కీల‌కంగా జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తుతున్నాయి. జ‌గ‌న్ పాల‌న ఎలా ఉంటుందో? అని ఒకింత భ‌యోత్పాతంగా ప్ర‌చారం చేసిన వారు సైతం ఇప్పుడు ఈ ప‌దిరోజులు చూసిన త‌ర్వాత ఇలా కూడా పాలించ‌వ‌చ్చా!? అని నోరు వెళ్ల‌బెడుతున్నారు. మొత్తానికి అనుకున్న ల‌క్ష్యం సాధించే క్ర‌మంలో జ‌గ‌న్ వేస్తున్న ప్ర‌తి అడుగు ప్ర‌జాప‌క్షంగా ఉండ‌డం స్వాగ‌తించాల్సిన విష‌యం.



మరింత సమాచారం తెలుసుకోండి: