రోజా గారు 2014లో వైసీపీ ఎమ్మెల్యేగా చిత్తూరు జిల్లా నగరి నుండి గెలుపొందారు. వైసీపీ తరుపున అదికార పక్షాన్ని ఎక్కువగా ప్రశ్నించింది కూడా రోజానే. తెలుగు దేశం పార్టీ రోజాను చివరకు సంవత్సరం పాటు అసెంబ్లీకు రాకుండా చేసారు.అంతే కాక రోజా గారు మంచి వాగ్ధాటి ఉన్న నేతగా కూడా పేరు తెచ్చుకున్నారు

 

కట్ చేస్తే వైసీపీకి 2019 ఎన్నికల్లో రికార్డ్ స్థాయి మెజారిటీ వచ్చింది. పార్టీ గెలిచిన రోజు నుండి రోజాకు మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరిగింది. మొదట స్పీకర్ పదవి ఇస్తారనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత హోం శాఖ లేదా మరే ఇతర శాఖైనా వస్తుందనే ప్రచారం జరిగింది


కానీ రోజాను ఏ మంత్రి పదవి వరింంచలేదు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం రెండున్నరేళ్ళ తరువాత వచ్కే కేబినేట్లో ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తాననేలా రోజాకు హామీ ఇచ్చారట. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం గురించి రోజా గారికి ముందే సమాచారం వెళ్ళిందట. రోజా మనసులో తనకు పదవి రాలేదని ఎలాంటి భాధ లేదని తెలుస్తుంది


మరింత సమాచారం తెలుసుకోండి: