టీడీపీ అధికారంలో ఉన్నపుడూ నోరు తెలిస్తే చాలు జగన్ అవినీతి పరుడని, రాష్ట్రాన్ని దోచుకుంటాడని టీడీపీ నేతలు కారుకూతలు కూశారు. కానీ చివరికి ఏమైంది . జగన్ అవినీతి లేకుండా చేయడానికి జ్యుడిషల్ కమిటీ అని చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. రివర్స్ టెండరింగ్ అని ప్రక్షాళన చేయబోతున్నారు. కానీ ఇన్ని రోజులు బాబుగారు చేసిందేంది. మట్టిని, ఇసుకను ఇలా అన్నింటిని దోచుకొని చివరికి ప్రజలు చేత ఘోర పరాజయాన్ని చవిచూశారు. 


ఇసుక, మట్టి, గనులను అక్రమ మార్గంలో తవ్వుకుపోయి కోట్లు ఆర్జించిన ప్రజా ప్రతినిధుల్లో కొందరికి తాజా ఎన్నికల్లో ప్రజలే తమ ఓటుతో బుద్ధి చెప్పారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో మైనింగ్‌ రాజాగా పేరొందిన ఓ అభ్యర్ధి ఈ ఎన్నికల్లో సుమారు 50 కోట్లు ఖర్చు చేసినప్పటికీ జనం తిరస్కరించడంతో ఓటమి చెందారు. కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అక్రమ మైనింగ్‌ వ్యాపారంలో కోట్లు గడించారు. అయితే ఎన్నికల ఫలితాలనంతరం ఏర్పడిన కొత్త ప్రభుత్వం తీసుకునే చర్యలతో వీరి ఉనికికి ముప్పు వాటిల్లుతుందా? అక్రమార్కులు ఇక దుకాణాలు సర్ధుకోవల్సిందేనా? అన్న చర్చ జనంలో జరుగుతోంది.


జగన్‌ ప్రజలకిచ్చిన హమీలను నిలబెట్టుకునే దిశగా పయనించిన పక్షంలో అనేక ఏళ్ళుగా అక్రమ మార్గంలో జరుగుతున్న మైనింగ్‌పై దృష్టిసారించాల్సి ఉంటుంది. తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వంతాడ కొండల్లో దశాబ్ధకాలంగా లాటరైట్‌ను అక్రమమార్గంలో తరలిస్తున్నారు. ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి మరీ ఇక్కడ తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ అక్రమ గనుల తవ్వకాలను స్థానిక తెలుగుదేశం పార్టీకి చెందిననేత స్వయంగా ఇంతకాలం నడిపించారు. ఎమ్మెల్యేల నుండి రాష్ట్ర ప్రభుత్వంలోకి పెద్దలకు సైతం ఈ నాయకుడే వాటాలు పంపేవారని సమాచారం! 


మరింత సమాచారం తెలుసుకోండి: