ఏపీ మంత్రివర్గం తొలి సమావేశం ప్రారంభమైంది. 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సోమవారం ఉదయం 10.30 గంటలకు సచివాలయం తొలి బ్లాకులోని, 
మొదటి అంతస్తులో గల మంత్రివర్గ సమావేశం మందిరంలో సమావేశం మొదలైంది.
 అధికారులు ఎనిమిది అంశాలతో కేబినెట్‌ అజెండాను రూపొందించారు.

అలాగే అక్టోబర్‌ 15 నుంచి అమలు చేయనున్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకంపై చర్చించనున్నారు. ఈ కేబినెట్‌లోనే పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రైతులు, మహిళలు, అవ్వా తాతలు, వికలాంగులు, ఉద్యోగులు, కార్మికుల ప్రయోజనాలే ప్రధాన అజెండాగా ముఖ్యమంత్రి కేబినెట్‌ సమావేశం నిర్వహిస్తున్నారు. 








మరింత సమాచారం తెలుసుకోండి: