విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తొలిసారి ఏర్పడిన తెలుగుదేశం పార్టీలోకి చాలా మంది వలస వచ్చారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధిస్తుందనుకుంటే ఘోర పరాజయం పాలైంది. దీంతో నేతలు ఎప్పుడు పార్టీ మారుస్తారనే భయంలో అధినేత చంద్రబాబు ఆందోళనలో ఉన్నారు. తాజాగా కడప లోకసభ అభ్యర్ధి టీడీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన ఆదినారయణ రెడ్డి పార్టీ మారాలనే ఆలోచనలో ఉన్నారనే పుకార్లు వస్తున్నాయి. 

బీజేపీకిలో ఆయన వెళ్లాలంటూ... అనుచురులు ఆదినారాయణపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఆదినారాయణ కూడా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. తాజాగా జరిగిన ఎన్నికల్లో కడప లోక్ సభ స్థానానికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి, వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాశ్ రెడ్డి చేతిలో 3 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఆదినారాయణ రెడ్డి ఓటమి పాలయ్యారు.

రాష్ట్రంలో వైసీపీ, దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నాయి. వైసీపీలోకి వెళ్ళాలనే యోచనలో ఆదినారాయణ అంత ఆశక్తి చూపడంలేదు. దీంతో ఆయన ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే, బీజేపీలోకి వెళ్లాలని ఆదినారాయణ రెడ్డిపై యన అనుచరులు ఒత్తిడి తెస్తున్నారు. దీంతో ఆదినారాణరెడ్డి సైతం ఈ విషయంలో గట్టిగానే ఆలోచిస్తున్నట్టు సమాచారం.

ఇక తనకెంతో పట్టున్న జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గంలో సైతం వైసీపీ అభ్యర్థి విజయం సాధించడం, జిల్లాలోని అన్ని నియోజకవర్గాలనూ వైసీపీ గెలవడంతో ఆదినారాయణరెడ్డి బీజేపీలో చేరేందుకు చూస్తున్నారని తెలుస్తోంది. దీనిపై అధికారికంగా ఇంతవరకూ ఆదినారాయణ ఏటువంటి ప్రకటనా చేయలేదు. తాజాగా మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి పార్టీ మారుతారన్న వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: