మంత్రి పదవులు ఇవ్వడం అన్నది ముఖ్యమంత్రి విచక్షణాధికారం మీద ఆధారపడి ఉంటుంది. ఆయన సలహా మేరకు గవర్నర్ వారిని మంత్రులుగా నియమిస్తారు. ఇది రాజ్యాంగంలో ఉంది. ఇక ముఖ్యమంత్రిని పదవి కావాలని పార్టీ వారు కోరవచ్చు. అదే పార్టీలో మరికొందరు సిఫార్స్ ల ద్వారా ఇవ్వమనవచ్చు.


అయితే వేరె పార్టీకి చెందిన వారు బద్ద శత్రువైన మరో పార్టీ అధినేతను ప్రభావితం చేయగలరా. ఆ విధంగా పదవి ఇస్తారా. అంటే జరగొచ్చు. ఎందుకంటే ఆయా జిల్లాల్లో బలం ఉన్న వారు, అప్పటివరకూ అధికారం చలాయించిన వారు  ఉంటే వారిని నియంత్రించి పార్టీ కోసం పనిచేసే వారు. సమర్ధంగా ప్రత్యర్ధులను ఎదుర్కొనేవారు మంత్రులుగా ఎంపిక కావచ్చు.


క్రిష్ణా జిల్లా విషయానికి వస్తే దేవినేని ఉమామహేశ్వరరావు సర్వశ్వంగా మొత్తం అయిదేళ్ళ టీడీపీ పాలన సాగింది. ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సన్నిహితుడు. దాంతో ఆయన‌దే రాజ్యం. ఆ విధంగా అన్నీ తానై వ్యవహరించి పార్టీలో గ్రూపులు పెంచి మొత్తానికి మొత్తం సీట్లు ఆయన పార్టీకి కాకుండా చేశారని సొంత పార్టీలోనే మిగిలిన నేతల ఆరోపణ.


ఇపుడు అదే విషయమై తెలుగుదేశం పార్టీ లో విజయవాడ ఎమ్.పి కేశినేని నాని వివాదం కొనసాగిస్తున్నారు. తాజాగా ఆయన మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావును ఎద్దేవ చేస్తూ ఒక వ్యాఖ్య చేశారు.దేవినేని ఉమకు కొడాలి నాని జీవితాంతం కృతజ్ఞుడిగా ఉండాలంటూ తాజాగా కేశినేని నాని పోస్ట్ చేశారు. దేవినేని వల్లే కృష్ణా జిల్లా నుంచి కొడాలి నానికి మంత్రి అయ్యే అవకాశం దక్కిందని ఆయన వ్యాఖ్యానించారు. 


నాని ఏ లక్ష్యంతో ఈ పోస్టింగులు పెడుతున్నారన్న చర్చ టిడిపిలో జరుగుతోంది.ఉమాకు ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాదాన్యత ఇవ్వడం వల్లే పార్టీ మునిగిందని చెప్పడం నాని ఉద్దేశమా?లేక ఇంకేదైనా కారణమా? మొత్తానికి ఉమ తాను మంత్రి పదవి కోల్పోతూ కూడా కొడాలి నానికి పదవి ఇప్పించారంటే గ్రేటే అనుకోవాలేమో.



మరింత సమాచారం తెలుసుకోండి: