రాజకీయం అంటేనే అది. ఎవరు ఎవరితో ఎపుడు కలుస్తారో చెప్పలేని పరిస్థితి. శత్రువులు అంటూ ఎవరికీ ఉండరు. ఏపీలో ఇపుడు ఓడలు బళ్ళు అయ్యాయి. మరి బళ్ళు అయిన ఓడల సంగతేంటి. అయిదేళ్ళ పాటు అలాగే కళ్ళార్పకుండా చూస్తూ వూరుకుంటారా.


ఈ మధ్య  హఠాత్తుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ ని ఏకంగా రాజ్ భవన్ కి వెళ్ళి ఏకాంత చర్చలు  జరిపారు. అదేంటి అన్నది  అప్పటికి బయటకు రాకపోయినా ఇపుడు దానికి సంబంధించిన న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. బాబు కేంద్రంలోని పెద్దలతో రాయబేరాలు సాగిస్తున్నారని గట్టిగా వైరల్ అవుతోంది.


ఆయన ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ. ఆయన రాజకీయ గండరగండడు. తిమ్మిని  బమ్మిగా చేయగల సమర్ధుడు చంద్రబాబు. మరి ఆయన ఇపుడు బీజేపీ పెద్దలతో  టచ్ లోకి వెళ్ళేందుకు ప్రయత్నం చేస్తున్నారన్న సమాచారంతో ఏపీలో రాజకీయ వేడి ఒక్కసారిగా టాప్ రేంజికి చేరుకుంది. బాబును దుష్మన్ గా బయటకు చెప్పే కమలదళంలోని కొంతమని ఆయనకు లోపల దోస్తులు గా ఉన్నారన్నది తెలిసిందే. మరి వారి సాయంతో ఆయన తన పూర్వపు సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నిస్తున్నారా అన్నదే ఇక్కడ ప్రశ్న.


ఇక అమిత్ షా తో కూడా బాబుకు డైరెక్ట్ గా  విభేదాలు లేవు. అయితే ఏపీలో పలు మీటింగులకు వచ్చిన షా బాబుకు ఎన్డీయే  ద్వారాలు మూసేశామని గట్టిగానే చెప్పి వెళ్ళారు. మరి బాబు రాయబేరాలకు షా వంటి వారు  ద్వారాలు  తెరుస్తారా. అసలు బాబు ఆలోచనలు ఏంటి. ఆయన మీద వస్తున్న ఈ ప్రచారంలో నిజమెంత ఉంది. కొంతకాలం ఆగితే అన్నీ తెలుస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: